Take a fresh look at your lifestyle.

హామాలీ..మోత!!

చదువు, సంధ్యలు పక్కకు పెట్టు
హమాలీ మోత పని  చేతపట్టు

పల్లెల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
అవే కదా ఉద్యోగ కల్పనా కేంద్రాలు

ఆరునెలల పాటు పని  దొరుకుతుంది
ఇంతకన్నా ఉపాధి ఇంకేముంటుంది

ఎన్నెన్నని కొలువులు పుట్టు కొస్తయి
చదువుకున్నోలందరకు ఎట్లోస్తయి

వ్యవసాయ మంత్రి సెలవిచ్చిండు
అమాత్యుల కడుపు సల్లంగుండ

వీపుమోత పని చర్చకు తెచ్చిండు!!
నిరుద్యోగులకు బువ్వ తొవ్వ చూపిండు!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply