Take a fresh look at your lifestyle.

హాజీపూర్‌ ‌దోషికి ‘ఉరి’

  • ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టు సంచలన తీర్పు
  • ముగ్గురు చిన్నారులపై
  • అత్యాచారం చేసి చంపిన శ్రీనివాస రెడ్డి
  •  కోర్టు నిర్ణయంపై  గ్రామస్థుల హర్షం

serial killer in telanganaతెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ ‌వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డికి నల్గొండ పోక్సో కోర్టు ఉరి శిక్ష విధించింది. శ్రీనివాసరెడ్డికి ఉరి శిక్షను ఖరారు చేస్తూ గురువారం ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించింది. నిందితుడు శ్రీనివాసరెడ్డి ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. మూడు కేసుల్లో వేర్వేరుగా జడ్జి వీవీ నాథ్‌రెడ్డి తీర్పును వెలువరించారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య ఘటన)కు సంబంధించి పోలీసులు పక్కాగా సాక్ష్యాలు సమర్పించడంతో న్యాయస్థానం శ్రావణి కేసులో ఉరి శిక్ష, మనీషా కేసులో జీవిత ఖైదు, కల్పన కేసులో నూ ఉరిశిక్ష కోర్టు విధించింది. కాగా, ఈ కేసులో తీర్పు గత నెల 27న వెలువడుతుందని భావించినప్పటికీ కొన్ని కారణాలతో తీర్పును కోర్టు గురువారానికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసు విచారణకు ప్రత్యేకాధికారిగా భువనగిరి ఎసిపి భుజంగరావును ప్రభుత్వం నియమించింది. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేవలం 90 రోజుల్లోనే విచారణను పూర్తి చేశారు. మొత్తం 101 మంది సాక్షుల వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. డీఎన్‌ఏ ‌పరీక్షలు ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ ‌నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించడంతో అని సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అంతకు ముందు మూడు కేసుల్లో నేరస్తుడిగా ప్రాసిక్యూషన్‌ ‌నిరూపించిందనీ, దీనిపై ఏమైనా చెప్పుకుంటావా అని న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. తనకే పాపం తెలియదనీ, పోలీసులు తనను కొట్టి ఒప్పించారని ఆయన జడ్డి ముందు రోదిస్తూ చెప్పాడు. తన తల్లిదండ్రులు వృద్ధులనీ, వారిని తానే చూసుకోవాలని తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని న్యాయమూర్తికి చెప్పుకొచ్చాడు. దయ చేసి తనను వదిలేయాలని న్యాయమూర్తి ముందు ప్రాధేయపడ్డాడు. శ్రీనివాసరెడ్డి వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం అతడిని దోషిగా ప్రకటించి ఉరి శిక్షను ఖరారు చేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌ ‌గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి వారి గ్రామానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో తన బైక్‌పై లిప్ట్ ఇస్తానన్న నెపంతో ముగ్గురు మైనర్‌ ‌బాలికలను బైక్‌పై తీసుకెళ్లి తన సొంత వ్యవసాయ బావి వద్ద అత్యాచారం చేసి అనంతరం పూడ్డి పెట్టాడు. హత్య చేసిన బాలికల మృత దేహాలను ఎవరి కంటా పడకుండా ఆయన పొలం వద్దనే ఉన్న వ్యవసాయ బావిలో పూడ్చి పెట్టాడు. ఇలా వరుసగా ముగ్గురు అమ్మాయిలను హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాగా, పోలీసులు గత ఏడాది ఏప్రిల్‌ 28‌న హాజీపూర్‌ ‌సీరియల్‌ ‌కిల్లర్‌ శ్రీ‌నివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అదే గ్రామం నుంచి కనిపించకుండా పోయిన మనీషాతో పాటు ఆ గ్రామానికి సమీపంలోని మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పననుకూడా కనపడకుండా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బావిలో మృతదేహం ఆధారంగా డాగ్‌స్క్వాడ్‌ ‌సాయంతో ఆ బావికి సమీపంలో వెతకగా, బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. బాలికలపై అత్యాచారం జరిపి పూడ్డిపెట్టినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతుగా విరారించగా ఆ బాలికలపై అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసుల ఎదుట శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. ంది. శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే ఆయన బావిలో తవ్వకాలు జరిపి ఆ ఇద్దరు బాలికల అస్థికలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

శ్రీనివాసరెడ్డికి ఉరితో గ్రామస్తుల సంబరాలు:
హాజీపూర్‌ ‌వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించడంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేక కోర్టు నిందితునికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే తమ బిడ్డలకు న్యాయం జరిగిందని సంబరాలు చేసుకున్నారు. ఈ కేసును వాదించిన బాలికల తరఫు న్యాయవాదులకు మిఠాయిలు తినిపించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లకు తమ బిడ్డలకు న్యాయం జరిగిందనీ, అయితే, వెంటనే ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply