Take a fresh look at your lifestyle.

దమ్మున్న హీరోయిన్‌..!

gutsy heroine

ప్రచారం కోసం ఎత్తుగడలు అవసరం లేదు. మనిషికి వ్యతిరేకంగా మనిషి, వారి మధ్య ఉండే అసహనం చాలు. దీపికా పదుకునే మంగళవారం ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీ నిష్క్రమణ ద్వారం దాటి వెళ్ళగానే జాతీయవాదానికి పోరాడుతున్నామని చెప్పుకునే యోధులు ఆమెపై విషం చిమ్మడం ప్రారంభించారు. ద్వేషాన్ని కక్కారు. ఆమె జాతీ వ్యతిరేకి అని ప్రచారం చేశారు. అర్బన్‌ ‌నక్సల్‌ అని ముద్ర వేశారు. పాకిస్తానీ అని ప్రచారం చేశారు. వీరంతా కండబలాన్ని ప్రదర్శించే జాతీయవాదులు, మెజారిటీ వాదాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నించే వర్గం. ఈ వర్గం ఎప్పుడూ దేశంలో మహిళ అన్యాయాన్ని గురించి, వివక్ష గురించి, హింస గురించి వ్యతిరేకంగా మాట్లాడగానే విరుచుకునిపడుతూ ఉంటుంది. ఆమెను మానసికంగా కుంగదీయడానికి పద ప్రయోగాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్నింటిని ప్రయోగిస్తుంది. అత్యంత కిరాతకంగా ఆమెను మానసికంగా హింసిస్తుంది. తాను విద్వేషమనే నరకాగ్నిలోకి ప్రవేశిస్తున్నానని ఆమెకు తెలుసో తెలియదో కానీ, ఆమె అవేమీ ఆలోచించకుండా జెఎన్‌ ‌యూనివర్శిటీలోకి ప్రవేశించారు. ఆమె అలా వెళ్లడం ఒప్పా లేక తప్పా ఈ విషయమై వివాదం తలెత్తినప్పుడు ఆమె మిత్రవర్గం, సౌహార్దవర్గం నోరు మెదపలేదు. సహనటీమణులు కూడా స్పందించలేదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. దేశంలో బహుళజాతి వ్యవస్థ ప్రమాదంలో పడినప్పుడు కనీసం ఒక్కరైనా నోరెత్తే వారుంటే అభినందించాలి. సూపర్‌ ‌స్టార్స్‌గా పిలిపించుకుంటున్న వారూ ఈ సంఘటనపై నోరెత్తలేదు. ఎవరికీ పట్టకపోయినా ఆమె మాత్రం తన మనసుకు తట్టిన ఆలోచనను అమలులో పెట్టింది. ఇందుకు అందరి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని ఆమెకు తెలుసు. అయినా లెక్క చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో బడా జాతీయవాదుల ప్రకటనలూ, వ్యాఖ్యానాలు ప్రముఖంగా వొచ్చాయి. వీరంతా కండబలం, అంగబలం, అర్థబలం ఉన్న వారు.

దీనినే కండబలం మిళితమైన జాతీయవాదం అంటారు. ఆమె పర్యటన గురించి అంతర్జాలంలో అనేక కథనాలు వెలువడ్డాయి. పేరూ, ఊరూ చెప్పకుండా విమర్శలు చేశారు. తమకు అందిన అవకాశాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నారు. అసమ్మతి గళాన్ని నొక్కేయడానికి ఈ యోధులంతా కంకణం కట్టుకున్నారు. ఈరోజు మనం కేవలం పేరుకు మాత్రమే ప్రజాస్వామిక వ్యవస్థలో జీవిస్తున్నామన్న సంగతి ఆమెకు తెలియకపోవచ్చు. అసమ్మతి వ్యక్తం చేసే వారిపై అన్ని వైపుల నుంచి విరుచుకుని పడేందుకు ఈ మాధ్యమాలనూ, ప్రసార సాధనాలను వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్‌ ‌నటీనటులు చాలా అరుదుగా కుటిల రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంటారు. దీపికా పదుకునే జెఎన్‌యూలోకి ప్రవేశించగానే విమర్శకులు ఆమెను లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించారు. ఆమె ఎవరి తరఫునో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమె తాజా చిత్రం ‘చపాక్‌’‌లోని పాత్రమాదిరిగా ప్రవర్తిస్తోందని అభివర్ణించారు. ఆమె సంయమనాన్ని కోల్పోయిందని విమర్శించారు.
ఎవరైనా అంగీకరించాల్సిన విషయం ఏమిటంటే, ఆమెకు కూడా ఈ సమాజంలో స్వేచ్ఛ ఉంది. తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు, తన మనసుకు నచ్చినట్టు చేసేందుకు స్వాతంత్య్రం ఉందనే విషయాన్ని అందరూ అంగీకరించాలి. జెఎన్‌యూ విద్యార్థుల విషయంలోనే కాదు. అన్యాయానికీ, వివక్షకూ గురైన వారి పట్ల సౌహార్దాన్ని ప్రకటించడం ఎంత మాత్రం జిమ్మిక్‌ ‌కాదు. ఆమె చేసింది సరైనదేనని మనం అంగీకరించాలన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఆమె ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండానే ఆ యూనివర్శిటీలో ప్రవేశించారు. ఆమె పథకం ప్రకారం వెళ్ళారా, జనాదరణ కోసం వెళ్ళారా, దేశంలో కోట్లాది మంది భావోద్వేగాలను వ్యక్తం చేయడం కోసం వెళ్ళారా? ఈ ప్రశ్నలకు ఆమె మాత్రమే సమాధానం చెప్పగలరు. అంతవరకూ మనం చపాక్‌ ‌మాదిరి వివాదాన్ని సృష్టించారని అనుకోవచ్చు.

Tags: jnu, deepika padukone, urban, Bollywood, chappak movie, promotions

Leave a Reply