Take a fresh look at your lifestyle.

కొరోనా బారిన పడ్డ గురుకుల పాఠశాల విద్యార్థులు

17 మంది విద్యార్థులకు.. ఐదుగురు టీచర్లకు నిర్దారణ
జగిత్యాల, మార్చి 19( ప్రజాతంత్ర డెస్క్) : ‌కొరోనా వైరస్‌ ‌రెండోదశలో గురుకుల పాఠశాల విద్యార్థులు బారీన పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు కొరోనా వైరస్‌ ‌సోకినట్లు నిర్దారణ కాగా శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానినగర్‌లో గల సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌బాలికల గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్షలు చేయగా కొరోనా సోకినట్లుగా నిర్ధారించారు. గత రెండు మూడు రోజుల నుంచి కొందరు విద్యార్థినులు దగ్గు, జలుబు, జ్వరంతో బాదపడుతున్న విషయాన్ని గుర్తించిన ఆపాఠశాల సిబ్బంది విద్యార్థులకు వైద్య పరీక్షలను చేయించాలని నిర్ణయించారు.

కాగా శుక్రవారం ఆ పాఠశాలల్లోని 31 మంది విధ్యార్థినులకు కొరోనా నిర్దారణ పరీక్షలను నిర్వహించగా 17 మందికి వైరస్‌ ‌సోకినట్లు నిర్దారణయ్యింది. ఆలాగే 5 గురు టీచర్లు కూడా కొరోనా బారీన పడ్డట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కొరోనా బారీన పడ్డ 17 మంది విద్యార్థినులను పాఠశాలకు సమీపంలోనే ఓ విడిగా ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌ ఏర్పాటు చేసి చికిత్సలను అందించేలా ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లోని విధ్యార్థినులకు కొరోనా బారీన పడ్డ విషయంతో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతోపాటు తల్లితండ్రులు అందోళనకు గురయ్యారు.

Leave a Reply