Take a fresh look at your lifestyle.

‌గుండె గుడి..!

పటిష్ట ఎముకల గూట్లో..
బహు భద్రం హృదయ గదులు
స్టెతస్కోపులకే వీనుల విందులు
అవిశ్రాంత లబ్‌డబ్‌ల శబ్దాలు..
ఆగితేనే కదా అంతిమ యాత్రలు !

హృదయ గదుల కవాటాలు
నిరంతర సంకోచ వ్యాకోచాలు
రుధిరమే నాళాల్లో ప్రవహించి..
కణకణానికి అపారశక్తిని అందించి..
ప్రాణాలనే పదిల పరుచును సదా !

దేహమనే దివ్య దేవాలయంలో..
గుండే కదా పవిత్ర గర్భగుడి..
మంచిని ఆక్సీజన్‌లా అందించి..
పోషకాల్ని కణజాలానికి చేర్చి..
విసర్జించు చేడు అనే వ్యర్థాల్ని !

గుండెలో గుండెను పెట్టుకొని..
హృదయంలో ప్రేమను నింపుకొని..
సరళ జీవనశైలిని ఆస్రయించి..
దురలవాట్లను అవలీలగా త్యజించి..
ఆయురారోగ్యాలతో జీవిద్దాం !

శారీరక వ్యాయామ చెమటలు
బిపి, షుగర్ల పక్కా నియంత్రణలు
మద్యం, పొగాకులకే విడాకులు
స్థూలకాయ కొవ్వు కరిగింపులు
హృదయ స్పందనలకే వరాలు !
– మధుపాళీ
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply