తుపాకీ మిస్‌ఫైర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్ఎస్సై ఆదిత్య సాయి కుమార్ కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించారు.వివరాల ప్రకారం ఈనెల 16న ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా టీఎస్ఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఆదిత్య సాయి చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
దీనితో తోటి ఉద్యోగులు ఆదిత్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు.అందరూ కలిసి జమచేసిన 27,50,000 రూపాయల చెక్కును ఆదిత్య సాయి కటుంబానికి అందజేశారు.బెటాలియన్ అదనపు డిజిపి అభిలాష్ భిష్తి స్వయంగా చెక్కును అందించారు.కష్టకాలంలో ఆదిత్య కటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు.భవిష్యత్తులో ఆదిత్య కటుంబానికి మరింత అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఇక కారుణ్య నియామకం కింద ఆదిత్య సోదరుడిని పోలీసు ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.