Take a fresh look at your lifestyle.

‘గన్‌ ‌కల్చర్‌’ ‌ప్రమాదం..!

“ఢిల్లీ ఎన్నికలు షాహీన్‌ ‌బాగ్‌ ‌చుట్టూ తిరిగి ఉండకపోతే గోపాల్‌, ‌కపిల్‌ ‌కుటుంబాలకు ఇంత కడుపుకోత ఉండేది కాదు. వాట్స్ అప్‌ ‌యూనివర్సిటీని వాడుకుని దేశభక్తి ముసుగులో అతివాద హిందూత్వమే దేశభక్తి అని యువకుల మనసుల్లో నూరిపోయకుంటే దేశ రాజధానిలో గన్‌ ‌కల్చర్‌ ‌కనిపించేది కాదు. మరో ముఖ్యమైన విషయం గురించి ఇక్కడ తప్పకుండా చర్చించాలి. షాహీన్‌ ‌బాగ్‌ ‌ధర్నాలో కనిపించే ఓ పోస్టర్‌ ‌గురించి ప్రధాన స్రవంతి జాతీయ మీడియాలో జరిగిన చర్చ చాలా తక్కువ. కనీసం ఆ పోస్టర్‌ ‌పైన సక్రమమైన చర్చ జరిగి ఉంటే కూడా కపిల్‌, ‌గోపాల్‌ ‌తమ జీవితాలను నాశనం చేసుకుని ఉండేవారు కాదు. షాహీన్‌ ‌బాగ్‌లో ఫాతిమా షేక్‌, ‌సావిత్రి బాయ్‌ ‌పూలే కలసి ఉన్న చిత్ర పటాలు కనిపిస్తాయి. ఫాతిమా షేక్‌, ‌సావిత్రిబాయి ఫులే ఇద్దరూ వెనుకబడిన అణగారిన వర్గాలకు విద్య నేర్పడంలో కీలక పాత్ర పోషించారు.”

'Gun Culture' Jamia Milia Islamia University

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి పోయి.. ‘రామ భక్తుడిని.. మీరు అడుగుతున్న స్వేచ్ఛను, మీకు ఇవ్వడానికి వచ్చా అంటూ.. అక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్న వారి పైన కాల్పులు జరిపిన గోపాల్‌ను తీవ్రవాది లేదా సంఘ విద్రోహక వ్యక్తి అని ముద్ర వేయడం కరెక్ట్ ‌కాదు…అని నరేంద్ర శర్మ అంటున్నారు. సిస్టం నడుపుతున్న వారి ఫెయిల్యూర్‌ ఇది. సిస్టం నడుపుతున్న వారి కుతంత్రాలకు బలి అయిన నవ యువకుడిగా గోపాల్‌ను చూస్తున్నాను. గోపాల్‌ ‌స్కూల్లో జాయిన్‌ అయి నాకు తారస పడినప్పుడు కచ్చితంగా అడుగుతాను. నువ్వు ఇంత ద్వేషాన్ని మనసులో ఎందుకు నింపు కున్నావు..? గోపాల్‌ ‌చేసినది ఖచ్చితంగా తప్పు..అయితే గోపాల్‌ ఆ ‌విధంగా ప్రవర్తించడానికి ప్రేరేపించిన వారిది ఘోరమైన తప్పు… అని నేను భావిస్తున్నాను. మన వ్యవస్థ ఫెయిల్యూర్‌ ‌పర్యవసానం గోపాల్‌ ‌ప్రవర్తన.. అని నేను నమ్ముతున్నాను.. గోపాల్‌ ‌స్కూల్లో జాయిన్‌ అయితే తనతో మాట్లాడి ఆయన మనసులో ఉన్న అపోహలను తొలగించి అతనిని మామూలు మనిషి చేయడానికి ప్రయత్నిస్తా..’’ అని ఒక ఉపాధ్యాయుడు ఎంత ఓపిక ప్రదర్శించాలో అంత ఓపిక ప్రదర్శిస్తూ మాట్లాతున్నారు నరేంద్ర శర్మ. ఈయన రామ భక్తుడు గోపాల్‌ ‌స్కూల్‌ ‌డైరెక్టర్‌.. ‌గోపాల్‌ ‌జామియా మిలియా ఇస్లామియా దగ్గర తుపాకీ కాల్పులు జరుపుతున్నప్పుడు ఆయన ఇంటిలో గోపాల్‌ ‌తాత ఒక్కరే ఉన్నారు. వార్తా చానళ్లలో గోపాల్‌ ‌దేశీ తుపాకితో కనిపించినప్పుడు ఇరుగు పొరుగు వారు తాతకు సమాచారం అందించారు. స్కూల్‌కి వెళ్తాను అని బయలుదేరిన మనమడు న్యూస్‌ ‌ఛానళ్లలో తుపాకీతో కనిపిస్తున్నాడేంటని ఆయన కంగారు పడ్డారు.

ఇంటి దగ్గర స్కూల్లో ఎక్కువగా మాట్లాడని శాంత చిత్తంతో కనిపించే గోపాల్‌ ‌రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు ఎలా పాల్పడ్డాడో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు… అని గోపాల్‌ ‌తాత అంటారు. మమ్మల్నందర్నీ విచారంలోకి నెట్టివేశాడు.. వాడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. మాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు అని గోపాల్‌ ‌కుటుంబ సభ్యులు వాపోతున్నారు..షాహీన్‌ ‌బాగ్‌లో కాల్పులు జరిపిన కపిల్‌ ‌గుర్జార్‌ ‌జర్నలిస్టు కావాలని అనుకున్నాడు. ఢిల్లీలో ఇంటర్‌ ‌పూర్తి చేసి బీఏ జర్నలిజంలో అడ్మిషన్‌ ‌తీసుకున్నాడు. చదువులో మనసు లగ్నం కాక తల్లిదండ్రులు ఉంటున్న గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. గ్రామంలో తండ్రి చేస్తున్న పాల వ్యాపారానికి సహాయపడుతూ ఉండేవాడు. శనివారం మధ్యాహ్నం షికారుకు వెళ్లి వస్తానని తండ్రికి చెప్పి, ఢిల్లీకి బయలుదేరి వచ్చాడు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు షాహీన్‌ ‌బాగ్‌లో కాల్పులు జరుపుతూ.. న్యూస్‌ ‌ఛానళ్లలో కనిపించాడు. కపిల్‌ ‌స్నేహితులు కపిల్‌ ‌తండ్రికి విషయం చెప్పగానే ఆయన నిశ్చేష్టులై నిలబడి పోయారు. దల్లుపురా గ్రామంలో కపిల్‌ ‌గుజ్జర్‌ ‌నివాసంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. కపిల్‌ ‌గుజ్జర్‌ ‌తండ్రి వణికే స్వరంతో అంటున్నారు. ‘‘నాకు తెలీదు వాడు ఎలా షాహీన్‌ ‌బాగ్‌ ‌చేరుకున్నాడో.. వాడి చేతిలో తుపాకీ ఎలా వచ్చిందో నాకు తెలియదు.. అందివచ్చిన కొడుకు జీవితం కళ్లెదురుగా నాశనం అవుతుంటే ఏం మాట్లాడను’’ అని నీరు అయిపోయారు..

ఢిల్లీ ఎన్నికలు షాహీన్‌ ‌బాగ్‌ ‌చుట్టూ తిరిగి ఉండకపోతే గోపాల్‌, ‌కపిల్‌ ‌కుటుంబాలకు ఇంత కడుపుకోత ఉండేది కాదు. వాట్స్ అప్‌ ‌యూనివర్సిటీని వాడుకుని దేశభక్తి ముసుగులో అతివాద హిందూత్వమే దేశభక్తి అని యువకుల మనసుల్లో నూరిపోయకుంటే దేశ రాజధానిలో గన్‌ ‌కల్చర్‌ ‌కనిపించేది కాదు. మరో ముఖ్యమైన విషయం గురించి ఇక్కడ తప్పకుండా చర్చించాలి. షాహీన్‌ ‌బాగ్‌ ‌ధర్నాలో కనిపించే ఓ పోస్టర్‌ ‌గురించి ప్రధాన స్రవంతి జాతీయ మీడియాలో జరిగిన చర్చ చాలా తక్కువ. కనీసం ఆ పోస్టర్‌ ‌పైన సక్రమమైన చర్చ జరిగి ఉంటే కూడా కపిల్‌, ‌గోపాల్‌ ‌తమ జీవితాలను నాశనం చేసుకుని ఉండేవారు కాదు. షాహీన్‌ ‌బాగ్‌లో ఫాతిమా షేక్‌, ‌సావిత్రి బాయ్‌ ‌పూలే కలసి ఉన్న చిత్ర పటాలు కనిపిస్తాయి. ఫాతిమా షేక్‌, ‌సావిత్రిబాయి ఫులే ఇద్దరూ వెనుకబడిన అణగారిన వర్గాలకు విద్య నేర్పడంలో కీలక పాత్ర పోషించారు. విద్యావేత్త ఫాతిమా షేక్‌, ‌సామాజిక సంస్కర్తలు జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులేతో కలసి పని చేసారు. ఆధునిక భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయులలో ఒకరైన ఫాతిమా షేక్‌, ‌మియాన్‌ ఉస్మాన్‌ ‌షేక్‌ ‌సోదరి. ఈమె ఇంట్లో జ్యోతిబా సావిత్రిబాయి ఫులే నివాసం ఉండేవారు. పూలే పాఠశాలలో దళిత పిల్లలకు విద్యను అందించడంలో జ్యోతిబా సావిత్రిబాయి ఫులేతో కలసి ఫాతిమా షేక్‌ అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేసే బాధ్యతలో పాలుపంచుకున్నారు. ఈ చారిత్రాత్మక సత్యం తెలిసిన కొంతమంది యువకులు షాహీన్‌ ‌బాగ్‌ ‌లో సావిత్రిబాయి ఫులే, ఫాతిమా షేక్‌ ‌పేరు మీద ఓ లైబ్రరీ కూడా నడుపుతున్నారు. ఇంత ముఖ్యమైన విషయం పైన ప్రధాన స్రవంతి మీడియా జరపాల్సిన చర్చ జరపకుండా పోలరైజేషన్‌ ‌పాలిటిక్స్‌కి తన మద్దతు ప్రకటించింది. పర్యావసానంగా సభ్యసమాజం తలదించుకునేలా హిందూ బిడ్డలైన కపిల్‌ ‌గుజ్జర్‌, ‌గోపాల్‌ ‌ప్రవర్తించారు.

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర ‘ఎవరికి స్వేచ్ఛ కావాలి.. నేను మీకు ఇస్తున్న స్వేచ్ఛ అంటూ’.. గోపాల్‌ ‌కాల్పులు జరిపినప్పుడు గాయపడిన షాదాబ్‌ ‌ఫారూఖ్‌, ‌గోపాల్‌ను చూస్తూ పలికిన పలుకులు ‘‘తుపాకీ పడేసి దగ్గరకి రా.. మనం ఇద్దరం మాట్లాడుకుందాం.. సమస్యకు పరిష్కారాలు వెతుకుదాం..’’ అంటూ గోపాల్‌ని శాంతపరచడానికి ప్రయత్నం చేశారు.. జమ్మూ నుంచి వచ్చి జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చదువుతున్నా షాదాబ్‌ ‌ఫారూఖ్‌ ‌గాయాల పాలు కావడంతో భయపడిన షాదాబ్‌ ‌ఫారూఖ్‌ ‌తల్లిదండ్రులు జమ్మూకు తీసుకుని వెళ్ళిపోయారు. షాదాబ్‌ ‌ఫారూఖ్‌ ‌చదువులో చురుగ్గా ఉండటమే కాక కళలలో కూడా మంచి ఆసక్తి ఉన్నవాడు. షాదాబ్‌ ‌ఫారూఖ్‌ ‌థియేటర్‌ ఆర్టిస్ట్, ‌మంచి గాయకుడు చక్కటి వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్, ‌ఫోటోగ్రఫీ హాబీ కావటం వలన మంచి ఫోటోగ్రాఫర్‌ ‌కూడా. ఈ అన్ని లక్షణాల వలన జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో షాదాబ్‌ ‌ఫారూఖ్‌ ‌మంచి పేరు ఉంది. తనతో పాటు చదువుకుంటున్న స్నేహితులకు చాలా సహాయం చేస్తారని, షాదాబ్‌ ‌ఫారూఖ్‌కి పేరుంది.. ద్వేషం నిండిన వాతావరణం లేకపోయి ఉంటే ఇంచు మించు సమాన వయస్కులైన షాదాబ్‌ ‌ఫారూఖ్‌, ‌కపిల్‌ ‌గుజ్జర్‌, ‌గోపాల్‌ ‌మధ్య చక్కటి యారనా సంభవించి ఉండేది. ఈ యువకుల చేతికి రక్తపు మరకలు అంటించిన రాజకీయంతో ఢిల్లీ ఎన్నికలను రగిలించి.. ఢిల్లీ ఓటర్ల చేతికి నల్ల సిరా అద్ది.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపించాం.

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం అంటే సరిపోతుందా.. ??
జనవరి మూడవ తారీకున సావిత్రిబాయి పూలే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అవుతున్న నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ ఈ విధంగా ట్వీట్‌ ‌చేశారు. ‘‘సావిత్రిబాయి ఫులేకు ఆమె జయంతి సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆమె తన జీవితం పేద, అణగారిన వర్గాల ఉన్నతికి, సాధికారతకు అంకితం చేశారు. విద్య, సామాజిక సంస్కరణలకు సావిత్రిబాయి ఫులే చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆమె ఆదర్శాలు మాకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. సావిత్రిబాయి ఫులే ఆశయాలు నెరవేర్చడానికి అవిరామంగా కృషి చేస్తున్నాము.’’అలాగే ప్రధానమంత్రి జనవరి 20వ తారీఖున బీజేపీ హెడ్‌ ‌క్వార్టర్స్ ‌నుంచి ఢిల్లీ ఎలక్షన్స్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి, పార్టీ క్యాడర్‌కు సందేశం ఇస్తూ.. ఓ ప్రకటన చేశారు. ‘‘ఆ సమూహం మనకి ఎప్పుడూ వోట్లు వేయదు. ఆ సమూహం వోట్లు మనకు అక్కర లేదు, అంచేత మనకు వోట్లు వేసే సమూహం గురించి ఆలోచించండి.. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నించండి అని ప్రకటించారు’’.. ప్రధాని రెండవ ప్రకటన దేశ రాజధానిలో గన్‌ ‌కల్చర్‌ ‌కనిపించేలా చేసింది. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి దేశ బాగు గురించి పని చేస్తే, దేశం ముందుకెళ్తుంది. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి.. ప్రధాన మంత్రిగా ఉంటూ.. తన పార్టీ బాగు కోసం పని చేస్తే, దేశం అమెరికా తరహా గన్‌ ‌కల్చర్‌లో ముందడుగు వేసే ప్రమాదముంటుంది.

Leave A Reply

Your email address will not be published.