Take a fresh look at your lifestyle.

ఆరు నెలల్లో ..గల్ఫ్ ‌దేశాలకు 10 వేలమంది అక్రమ వలసలు

వీరంతా విజిట్‌ ‌విజాలపై వెళ్లడం పట్ల మన దేశంలో గాని, అక్కడి దేశంలో గాని రికార్డ్ ‌కాబడరు. కేవలం పర్యాటకులుగా మాత్రమే వెళ్లినట్లు, తిరిగి రానట్లు ఉంటుంది. కార్మికులుగా గానీ, లేదా ఇతరత్రా రికార్డులో గానీ ఏవీ కూడా నమోదు కావు అని అనుభవాగ్నులు, స్వచ్చంద సంస్థల వారు తెలుపుతున్నారు. నేడు ఎన్నో స్వచ్చంద సంస్థలు అవగాహన సదస్సులు పెట్టినా, యువతను ఎంత చైతన్య పరిచినా ఏజెంట్ల మాయమాటలకు, మోసపూరిత పనులకు అవన్నీ మంట గలిసిపోతున్నాయి.

Gulf country indian workers

అయ్యా… అవ్వ అప్పులు చేసి, ఉన్న భూమి జాగలు అమ్మి కొడుకులను ఉన్నత చదువులు చదివించి ఉద్యోగాలు చేస్తారని కన్న కలలన్నీ నేడు కూడా కలలుగానే మిగిలి పోయాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో వస్తాయనుకున్న కొలువులు రాకపాయే…డిగ్రీలు, పీజీలు చదివినా   ఇస్తారనుకున్న సర్కార్‌ ‌నౌకర్లు ఇవ్వకపాయిరి. ఇగ ఉద్యోగం దొరుకక, ఉపాధి లభించక, పొట్ట గడవని పరిస్థితిలో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ యువత మళ్లీ ఎడారి దేశాలైన గల్ఫ్‌కు వలస బాటలు పట్టారు. గల్ఫ్ ‌దేశాలలో సైతం పనులు లేక, ఎన్నెన్నో కంపెనీలు మూతబడి వలస వెళ్లిన తెలంగాణ ప్రాంత వాసులు ముప్పు తిప్పలు పడ్డ సంగతి మనందరికీ తెలిసిందే. ఎడారి దేశంలో మన వారి బ్రతుకుపై ఎన్నెన్నో కథనాలు చదివాం, గల్ఫ్ ‌దేశాలలో సైతం మనవారి ఆత్మహత్యలు, ప్రమాద మరణాలు అందరికీ తెలిసినవే… అయినా మన ప్రాంతంలో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లేవని కొందరు, ఎంతో గొప్ప చదువులు చదివి అందరి కండ్లముందు కూలి-నాలి పని చేయడానికి సిగ్గు పడి మరికొందరు ఇక్కడ బ్రతకడమే కష్టమని నిర్ణయించుకొని
నిరుద్యోగ యువత ఎడారి దేశాలకు వలసబాట పట్టారు.  గడిచిన ఆరు మాసాలలోనే తెలంగాణ ప్రాంతం నుండి దాదాపు 10 వేల పైచిలుకు నిరుద్యోగ యువకులు యూఏఈ దేశానికి వలస వెళ్లారు. కానీ, వీరంతా ఉద్యోగ రీత్యా కంపనీ వీసాలపై వెళితే కొంత వరకు బాగుండు. అక్రమార్గంలో విజిట్‌ ‌కం ఎంప్లాయిమెంట్‌ ఒప్పందం మీద యాజమాన్యాలతో కుమ్మక్కై ఏజెంట్ల ద్వారా యూఏఈ దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. విజిట్‌ ‌వీసా కాలం 6 రోజుల నుండి 90 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆలోపు వీరంతా యూఏఈ దేశంలో ఏదో ఒక కంపెనీలో పని వెతుక్కొని స్థిరపడాలి.
అక్కడి కంపెనీ వాడు ఒప్పుకుంటేనే వీసా స్టాంపింగ్‌ ‌జరుగుతుంది..లేకుంటే లేదు. విజా స్టాంపింగ్‌ ‌జరగక పోతే అక్రమార్గంలో(కలివెళ్లిగా) పని చేయాల్సి ఉంటుంది.

యూఏఈ అధికారులకు ఎప్పుడు పట్టుబడితే అప్పుడు అక్కడి జైల్‌కు వెళ్లి తగిన శిక్ష అనుభవించి, స్వదేశానికి తిరిగి రావాలంటే నానా రకాలుగా ఇబ్బందులు పడాల్సిందే. అయితే ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతనే వలసబాట పట్టగా ఉపాధిలేని మరికొంత మంది సాధారణ వ్యక్తులు కూడా అప్పు – సప్పు జేసి వారి వెంట విదేశాలకు వలస వెళ్లారు. ఇంత జరిగినా సుమారు పది వేల పైచిలుకు యువత విదేశాలకు విజిట్‌ ‌విజాలపై వలస వెళితే పట్టించుకున్న అధికారులే కరువయ్యారు. కంపెనీ వీసాలపై ఎంప్లాయిమెంట్‌గా వెళితే వీరందరికీ తల 10 లక్షల ప్రవాసీ బీమా యోజన పథకం అధికారికంగా వర్తించేది. వీరంతా విజిట్‌ ‌విజాలపై వెళ్లడం పట్ల మన దేశంలో గాని, అక్కడి దేశంలో గాని రికార్డ్ ‌కాబడరు. కేవలం పర్యాటకులుగా మాత్రమే వెళ్లినట్లు, తిరిగి రానట్లు ఉంటుంది. కార్మికులుగా గానీ, లేదా ఇతరత్రా రికార్డులో గానీ ఏవీ కూడా నమోదు కావు అని అనుభవాగ్నులు, స్వచ్చంద సంస్థల వారు తెలుపుతున్నారు. నేడు ఎన్నో స్వచ్చంద సంస్థలు అవగాహన సదస్సులు పెట్టినా, యువతను ఎంత చైతన్య పరిచినా ఏజెంట్ల మాయమాటలకు, మోసపూరిత పనులకు అవన్నీ మంట గలిసిపోతున్నాయి.

వలస వెళ్లిన 10 లక్షలపై చిలుకు యువతలో కరీంనగర్‌, ‌సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌ ‌కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నిరుద్యోగ యువత సమస్యలను ఆసరాగా తీసుకొని కంపెనీ యజమానులు, రిక్రూటింగ్‌ ఏజెంట్లు కుమ్ముక్కయి ఇలాంటి మోసాలకు పాల్పడుతూ అక్రమార్గంలో విదేశాలకు యువతను రవాణా చేస్తున్నారని విద్యావంతులు, మేథావులు, అనుభవశాలులు ఆరోపిస్తున్నారు.  విజిట్‌ ‌వీసాపై స్వదేశం విడిచి, విదేశాలకు వెళ్ళే వలసదారులను  విమానాశ్రయాల్లోని అధికారులు సరిగా  పరిశీలిస్తున్నారా…? అని వారు ప్రశ్నిస్తున్నారు. స్లిప్పర్లు వేసుకుని వెళ్లే ఒక పేద కార్మికుడు పర్యాటకుడా….? ఉపాధి కోసం వెళ్లేవాడా..? అనే విషయాన్ని  అధికారులు గుర్తించలేరా…? అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆరు మాసాలలోనే 10 లక్షల మందికి పైగా యువత యూఏఈకి విజిట్‌ ‌వీసాలపై వెళ్లారంటే….! చూస్తూ ఉన్న ఈ అధికారులకు ఇంత మంది ఎందుకు వెళుతున్నారు అనే  అనుమానాలు రాలేదా….? అని, ఒకవేళ వచ్చినా.. యజమానులతో, ఏజెంట్లతో చేతులు కలిపే ఇలా ఏమి ఎరుగనట్లు నటిస్తున్నారా…? అని వారు  ప్రశ్నిస్తున్నారు. కానరాని దేశాలకు వెళ్లిన వీరంతా రేపు కష్టాల పాలౌతే…. ఏదన్నా జరుగ కూడనిది జరిగితే బాధ్యులు ఎవరౌతారు..? ఇప్పటికైనా… ఆంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విదేశాల వలసలు నిలిచిపోయేలా అందరికీ ఉద్యోగ – ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇలాంటి అక్రమ రవాణాదారులపై చట్టరీత్యా తగు చర్యలు తీసు కొని, చట్టబ ద్ధంమా యోజన పథకంతో సహా అన్ని రకాల సౌకర్యాలతో వెళ్లేలా చూడాలని ఆశిద్దాం.

Leave a Reply