Take a fresh look at your lifestyle.

ఇం‌టర్‌ ‌ఫలితాల విడుదలకు మార్గదర్శకాలు

ఖరారు చేసిన విద్యా కమిటీ.. ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు
కొరోనా మహమ్మారి కారణంగా ఇంటర్‌ ‌సెకండియర్‌ ఎగ్జామ్స్‌ను రద్దు చేసిన ప్రభుత్వం ఫలితాల కోసం కసరత్తు చేస్తున్నది. ఈ  క్రమంలో ఫలితాల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ మార్గదర్శకాలు ఖరారు చేసింది. స్జబెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించాలని నిర్ణయించారు. ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు కేటాయించనున్నారు.

గతంలో ఫెయిల్‌ అయిన స్జబెక్టులకు 35 శాతం మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాక్‌లాగ్స్ ఉం‌టే ఆ స్జబెక్టులకు రెండో ఏడాది 35 మార్కులు, ప్రయివేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంటర్‌ ‌బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply