Take a fresh look at your lifestyle.

ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటున్నారు

టిడిపి నేతలపై మండిపడ్డ గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం,అగస్టు 31 : త్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ‌మండిపడ్డారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదన్నారు. మంగళవారం ఆయన డియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. విశాఖ అభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చూస్తే టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేయలేదా అంటూ ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను ఎల్లో డియాతో కలిసి దెబ్బ తీస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖ సముద్రంలో కలిసి పోతుందని తప్పుడు ప్రచారం చేశారు. అమరావతి కోసం విశాఖకు అన్యాయం చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్‌ ‌రాకుండా టీడీపీ ఎంపీలు లేఖలు రాశారు. విశాఖకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే ఎందుకు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు నోరు మెదపలేదని అమర్‌నాథ్‌ ‌ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిసిన టీడీపీ నేతలు.. చంద్రబాబు బంట్రోతుగా పని చేస్తున్నారు.

చంద్రబాబు భజన చేసేందుకే టీడీపీ నేతలు సమావేశం పెట్టినట్లు ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏనాడైనా చంద్రబాబు పట్టించుకున్నారా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేసింది దివంగత మహానేత వైఎస్సార్‌. ‌టీడీపీ ఉద్దండులు దద్దమ్మల్లా మాట్లాడారు. అభివృద్ధి చేస్తే ప్రజలు ఓడించారని అచ్చెన్నాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ‌ధ్వజమెత్తారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవని వివరించారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు. అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉన్నాయి కనుకనే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని చెప్పారు. టీడీపీకి విశాఖపట్నంలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అవసరం లేదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్నారా అని మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు. టీడీపీ నేతలు చెప్పిన అబద్దాలే పదేపదే చెబుతున్నారని గుడివాడ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉందని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డిది అని గుర్తు చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.

Leave a Reply