Take a fresh look at your lifestyle.

దడ పుట్టిస్తున్న ధరలు…సామాన్య ప్రజలపై కేంద్రం గుదిబండ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డడంతో సామాన్యుల బాధలు  చెప్ప లేని పరిస్థితి. సంపాదన అంతంత మాత్రమే ఉండడం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అనే చందంగా ఉంది మధ్యతరగతి బతుకుల జీవితాలు. రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబానికి మూడు పూటలా భోజనం పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇప్పుడు మళ్లీ కరోనా  కేసులు బయట పడుతున్నాయి. కేసులు బాగా పెరిగితే మళ్లీ లాక్‌ ‌డౌన్‌ ‌తప్పదు. దేశంలో ధరల మోత మోగుతుంది. పాల నుంచి వంట గ్యాస్‌ ‌వరకు, పన్నుల నుంచి వైద్య ఖర్చుల వరకు అన్ని ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు  అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పెరిగిన ఖర్చులకు అనుకూలంగా ఆదాయాలు లేకపోవడంతో నెల నెల భారం పెరుగుతూనే ఉంది. కడుపునిండా తినడానికి కూడా భయపడే రోజులు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆకలి బాధలు తెలిసిన చాయ్‌ ‌వాలా ప్రధాని అయితే బతుకులు బాగుపడతాయని అనుకున్నారు కానీ, కేంద్ర ప్రభుత్వం వస్తువులు ఉండడం నేర్పించింది. వంటింటి సరుకుల ధరలు భగ్గుమని పించేలా చేసింది. గతంలో నెలవారి సరుకులు ఒకసారి తెచ్చుకుంటే ఇప్పుడు వారానికోసారి తెచ్చుకోవడమే అతి కష్టంగా ఉంది. జేబులో వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్తే అరకోరా సరుకులే వస్తున్నాయి. ఖర్చు లెక్కకు మించి అవుతుంది. చుట్టాలు వచ్చినా టీ ఇవ్వలేని దుస్థితి దాపరించింది. పెరిగిన ఖర్చులకు అనుకూలంగా ఆదాయాలు లేకపోవడంతో నెల నెల భారం పెరుగుతుంది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలతో పాటు ఇంటి అద్దెలు, విద్యుత్‌ ‌చార్జీలు, సొంతిల్లు కలిగిన వారికి ఆస్తిపన్నులు, విద్య, వైద్యంలో పెరిగిన ఖర్చులు, కూరగాయలు, పాలు ఇతర నిత్యవసర ధరలతో అన్ని తరగతుల ప్రజలు  ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ పోషణ కోసమే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  కూరగాయ ధరలు  ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటికి రోజుకు కేవలం కూరగాయలకే వందకు పైగా ఖర్చు అవుతుంది. వీటితోపాటు వంటనూనె లీటరుకు  రూ. 170 నుంచి రూ. 190 కి పెరిగింది. మేలు రకం బియ్యం కిలో 50 నుంచి 60 వరకు పెరిగింది. ఇవి ఇలా ఉంటే కందిపప్పు,మినప్పప్పు, పెసరపప్పుల ధరలు పెరిగాయి. కీలకమైన వంట గ్యాస్‌ ‌ధరను భరించలేనంతగా మోడీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది ప్రస్తుతం ఒక గ్యాస్‌ ‌రిఫిల్‌ ‌సిలిండర్‌ ‌ధర రూ.1,152 ఉంది. డెలివరీ ఖర్చు కలుపుకుంటే రూ.1200 వరకు తీసుకుంటున్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు కూడా రోజురోజుకు పెరుగుతూ   జనానికి భారంగా మారుతున్నాయి. ఎన్నికలు ఉన్న సమయంలోనే పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు కేంద్రం కొంత తగ్గించి ఎన్నికలు అయిపోగానే ఆయా రాష్ట్రాల్లో దానికి రెట్టింపుగా పెంచుతూఉంది. దవాఖానాలోని మందులు కొనాలంటే కూడా  ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. షుగర్‌ ‌బీపీ లకు సంబంధించిన మందుల ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. యాంటీబయాటిక్స్ ‌మందుల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒక విద్యుత్‌ ‌చార్జీలు ఎడాపెడా పెంచుతూ, కస్టమర్‌, ‌ఫిక్సడ్, ఓవర్‌ ‌లోడ్‌, ‌ట్రూ ఆప్‌ ‌చార్జీల పేరుతో రెండు నెలలకోసారి ఏదో ఒక రూపంలో భారీగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ ‌రంగంలో పనిచేసే ఉద్యోగులే కాకుండా ప్రభుత్వంలో పని చేసే చిరుద్యోగుల జీవన ప్రమాణాలు కూడా ఇటీవల కాలంలో దారుణంగా తయారై కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. గత తొమ్మిదేళ్ల పాలనలో 60% నుంచి 75% నిత్యవసర ధరలు పెరిగాయి. ఇంటి ఖర్చులు డబుల్‌ అయ్యాయి. పేద మధ్యతరగతి మీదనే ఎక్కువగా పడుతుంది. ఫలితంగా సగటు పౌరుడు రోజురోజుకు పేదరికంలోకి నెట్టి వేయబడుతున్నాడని కేంద్ర వాణిజ్య, వ్యవహారాల శాఖ,కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, తదితర శాఖలు వెల్లడిస్తున్న  గణాంకాలే తెలుపు తున్నాయి. దేశ జనాభాలో మధ్యతరగతి జనాభా 29%, జాతీయ ఆదా యంలో వారిది 79% వాటా దేశీయ వస్తు ఉత్పత్తుల వినియోగదారుల్లో 70% వారే ఉన్నారు. అంటే దేశ ప్రగతిలో వారి పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల ఫలితంగా ఇప్పుడు దేశంలోని మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికి దిగజారి పోతుంది నలుగురు కుటుంబ సభ్యుల  సగటు ఖర్చు ఈ తొమ్మిదేళ్లలో రెండింతలు అయింది. నిత్యవసర సరుకులు రవాణా ఖర్చులు, విద్య వైద్యం అద్దె ఇలా అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సంవత్సరంలో ధరలను రెండు నుండి మూడుసార్లు పెంచుతూ వస్తుంది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ‌కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ ‌వస్తువుల ధరలను మూడు నుంచి ఐదు శాతం పెంచాయి. అసలే వేసవికాలం   వేసవికాలంలో ఎండలు  ఎలా మండుతాయో ఫ్రిడ్జ్ ‌వాషింగ్‌ ‌మిషన్‌ ఎయిర్‌ ‌కండిషన్‌ ‌ధరలు కూడా అలాగే వండుతాయి.  వీటి వీటి ధర ఇంతకుముందు ధర కంటే 10% పెరగవచ్చని తెలుస్తుంది. ద్రవ్యోల్బణ ప్రభావం కూడా ఆటో రంగంపై కనిపిస్తుంది. ఆటో కంపెనీలు పలుమార్లు వాహనాల ధరలను పెంచాయి. చిన్నారుల పోషణకు అందించే ఉత్పత్తి ధరలు కూడా పెరిగిపోయాయి. గత రెండు ఏళ్లలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా వడ్డీ రేటు పెంచడంతో రుణ గ్రహీతలపై ఈ ఏం ఐ భారం పెరిగింది. మోడీ ప్రధాని అయిన తర్వాత సామాన్యులకు వినోదం దూరమైంది గతంలో రూ. 150 చెల్లిస్తే 150కి పైగా టీవీ చానల్స్ ‌వచ్చేవి.ఇప్పుడు సంస్కరణల పేరుతో రూ. 400 చెల్లించిన 100 చానల్స్ ‌రావడం లేదనేది టీవీ వీక్షకుల ఆవేదన. ఇలా అన్ని వర్గాల వారు, ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగస్తులు, కూలి చేసుకొని బతికే కార్మిక కర్షక వర్గాలు  ధరల పెరుగుదలతో  బతుకు బరువై,  భారమై పోతుందని చెప్తున్నారు.
image.png
మోటె  చిరంజీవి,
: 9949194327.

Leave a Reply