Take a fresh look at your lifestyle.

దేశమంటే మట్టికాదోయ్‌… ‌దేశమంటే మనుషులోయ్‌ ..!

మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొరోనా వైరస్‌  ‌వ్యాప్తి నియంత్రణకు లాక్‌ ‌డౌన్‌ ఒకటే మార్గమని అన్ని దేశాల అభిప్రాయం . సమర్ధవంతంగా లాక్‌ ‌డౌన్‌ అమలు చేసిన దేశాలు వైరస్‌ ‌విస్తరణను నియంత్రించ గలిగాయి ..లాక్‌ ‌డౌన్‌ ‌సుదీర్ఘ కాలం కొనసాగితే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి వైరస్‌ ‌కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ‘‘జాన్‌ ‌హాయ్‌ ‌తో జహాన్‌ ‌హాయ్‌ ..’’ అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ , ‘‘బతికుంటే బలుసాకు తినొచ్చు ..’’ అని ముఖ్య మంత్రి కె చంద్ర శేఖర్‌ ‌రావు మనుషుల ప్రాణాలకు ప్రాధాన్యతనిచ్చారు…స్వచ్చంద సంస్థలు , సామాజిక కార్యకర్తలు అన్నార్తులకు తమ వంతు సహాయాన్ని అందిస్తూ మానవీయతను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మహా కవి గురజాడ అప్పా రావు ‘దేశమంటే మట్టి కాదోయ్‌ ..‌దేశమంటే మనుషులోయ్‌ ..’అన్న మాటలు స్ఫూర్తి నిస్తున్నాయి. మనుషుల ప్రాణాలకంటే ..ఆర్ధిక వ్యవస్థ కోసం ఆందోళన పడేవారు మహాకవి గురజాడ మాటలు గుర్తు చేసుకోవాలె ..ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం గురించి ఆందోళన చెందితే అది మరో వైరస్‌ల పరిణమించే ప్రమాదమున్నది . దేశవ్యాప్తంగా 3 వ లాక్‌ ‌డౌన్‌ ‌కొన్ని సడలింపులతో మరో రెండు వారాలపాటు సోమవారం నుండి ప్రారంభమయింది .రాష్ట్రం లో లాక్‌ ‌డౌన్‌ ‌సమీక్ష కోసం   మంత్రి మండలి ఈ రోజు సమావేశం కానున్నది ..

తెలంగాణలో కొరోనా కేసుల సంఖ్య నిజంగానే తగ్గుముఖం పడుతోందా ? వ్యాధి నిర్దారణ పరీక్షల విషయంలో ప్రభుత్వం చెబుతున్న అంశాలన్నీ వాస్తవమేనా ? కేసుల సంఖ్య తగ్గిందన్న సాకుతో ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసే దిశగా పావులు కదుపుతోందా ? ఈనెల 8 నాటికి రాష్ట్రంలో ఒక్క కొరోనా కేసు కూడా ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల చెప్పడంలో ఆంతర్యమేమిటి ? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలచి వేస్తున్న ప్రశ్నలివి. ఓవైపు, దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది…పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. అయితే, తెలంగాణలో గత పది రోజులలో మొదటి వారంలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఆ తరువాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. . రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నదని అంతా భావిస్తున్న సమయంలో మూడు రోజుల క్రితం 16, ఆదివారం ఏకంగా 22 కేసులు నమోదు కావడం అందులోనూ రాష్ట్ర రాజధానిలోనే అత్యధికంగా 21 పాజిటివ్‌గా నమోదు కావడంతో ప్రభుత్వం చెబుతున్న విధంగా రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నిజంగానే నియంత్రణలో ఉందా ? లేక విజృంభిస్తోందా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో కేసు సంఖ్య తగ్గిన సమయంలో ఇందుకు ముందు జాగ్రత్తగా అమలు చేసిన కఠిన నిబంధనలే కారణమని ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతుండగా, మరి తాజాగా కేసుల సంఖ్య పెరగడంపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రతిపక్షాలు, టీ జేఏసి, సామాజిక కార్యకర్తలు, మేధావులు స్వచ్చంద సంస్థలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాలను పెడచెవిన బెట్టి అతి తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్న కారణంగానే రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కొరోనా విస్ఫోటనం జరిగి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మే 1 నాటికి రాష్ట్రంలో 1044 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 28 మంది మృత్యువాతపడ్డారు. కొరోనాకు చికిత్స పొంది 464 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో పరీక్షలు చేసే సామర్ద్యం రోజుకు 1540 వరకూ ఉందనీ, కావాలంటే మరో 5000 పరీక్షలను కూడా చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. మరి అలాంటప్పుడు రోజుకు కేవలం 500 పరీక్షలతోనే ఎందుకు సరిపెడుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలో కేవలం గర్భిణిలకు ప్రతీ రోజూ కనీసం రోజుకు 280 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించాలి. కానీ, రాష్ట్రంలో రోజూ జరుగుతున్న అన్ని రకాల పరీక్షలు మొత్తం కలిపినా 150 దాటడం లేదనీ, మరి అలాంటప్పుడు ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాలు ఎక్కడ అమలవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వాస్తవానికి తెలంగాణలో పరీక్షలు తక్కువగా జరగడంతోనే కేసులు తక్కువగా నమోదవుతున్నాయనీ, పరీక్షల సంఖ్య పెంచితే, కేసుల సంఖ్య పెరగడంతో పాటు హాట్‌స్పాట్‌ ‌జిల్లాల సంఖ్య కూడా పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇవన్నీ పట్టించుకోకుండా మంత్రి ఈటల ప్రకటించిన విధంగా ఈనెల 8 తరువాత కూడా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ పోతే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌పూర్తిగా ఎత్తివేసిన పక్షంలో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కునే సామర్ద్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా అని మేధావులు, వైద్య నిపుణులు, రాజకీయ వేత్తలు, సామాన్య పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇపుడు తెలంగాణలో కొరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని వైద్య నిపుణుల అభిప్రాయం. ఒకవైపు, రాష్ట్రంలో కేసులకు మూలం ఎక్కడుందో తెలియడం లేదని అంటూనే మరోవైపు, సామాజిక వ్యాప్తి లేదనడంలో అర్థం లేదనీ, కోరోనా దావానలంలా వ్యాప్తి చెందే వైరస్‌ ‌నాలుగో దశకు చేరి ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు చేకూర్చక ముందే ప్రభుత్వం మేల్కొనాలని హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ కొరోనా నాలుగో దశ రాష్ట్రంలో ప్రారంభమై సామాజిక వ్యాప్తి చెందితే దానిని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద సరిపోను వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు కొరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించే సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు కూడా లేవన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ వైద్యుల సంఖ్య 5000 కాగా, వీరిలో 2000 మంది జూనియర్‌ ‌డాక్టర్లు కాగా, మరో 1000 మంది మెడికల్‌ ‌కళాశాలల్లో పనిచేస్తున్న సీనియర్‌ ‌వైద్యులు, ప్రొఫెసర్లు. వీరుకాకుండా ప్రాథమిక ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులలో పనిచేస్తున్న వారి సంఖ్య మరో 1000 ఉంటుంది. కాగా, వీరుకాకుండా మరో 1000 మంది ఔట్‌ ‌సోర్సింగ్‌, ‌కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వైద్యులు ఉన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికి కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినా, వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ కొరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి భారీ స్థాయిలో కేసులు నమోదైన పక్షంలో ఎక్కడివారికి అక్కడే వైద్య చికిత్సలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ వైద్యులు ఏ మూలకు సరిపోతారనేది ప్రశ్న. మరోవైపు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తి కాగా, ఈ ఆరేళ్లలో ప్రభుత్వం కేవలం 143 మంది వైద్యులను మాత్రమే నియమించింది. ప్రతీ ఏటా పదవీ విరమణ పొందుతున్న వైద్యులతో పాటు కొత్త మెడికల్‌ ‌కళాశాలు, ప్రభుత్వం చెబుతున్న విధంగా వివిధ ఆసుపత్రుల స్థాయి పెంపుతో అవసరమైన వైద్యుల పోస్టులను భర్తీ చేసే అంశంపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదైన గాంధీ ఆసుపత్రిలో 1200 మంది వైద్యులు ఉండాలి.కానీ, అందుకు భిన్నంగా అక్కడ ప్రస్తుతం కేవలం 400 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో వైద్యానికి మాత్రమే సరిపోయే వైద్యుల సంఖ్యతో భవిష్యత్తులో కొరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిన పక్షంలో వైద్య చికిత్సలు అందించడం ప్రబుత్వానికి సాధ్యమయ్యే పనేనా అన్న ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కనీసం మరో నెలపాటు కొనసాగించడమే మంచిదనే అభిప్రాయాన్ని రాష్రంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 40 రోజుల లాక్‌డౌన్‌ ‌పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా మే 3తో ముగియనున్న గడువును మరో రెండు వారాలకు పెంచింది. మరోవైపు, తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ‌గతంలో ప్రకటించిన విధంగా ఈనెల 7 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించకుండా ఎత్తివేతకే మొగ్గు చూపిన పక్షంలో కొరోనా కేసులు ఒక్కసారిగా విస్పోటనం చెందడం ఖామయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ‌కూడా బతికుంటే బలుసాకు తినొచ్చు, లాక్‌డౌన్‌ ‌కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెనుభారం పడుతున్నా ప్రజల ప్రాణాలే ముఖ్మమని పలుమార్లు ప్రకటించారు. ప్రస్తుతం కొరోనా మహమ్మారి నియంత్రణకు ఎలాంటి మందు ఇంకా కనిపెట్టని పరిస్థితిలో లాక్‌డౌన్‌ ‌మినహా మరో ప్రత్యామ్నాయం లేదని విస్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో విజృంభించకముందే లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించి ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా సీఎం కేసీఆర్‌ ‌ముందు చూపుతో వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply