జనవరి నుంచి జీఎస్టీ చెల్లింపు విధానంలో మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 రిటర్నస్ ఇవ్వాల్సి వొస్తోంది. కానీ, ఈ జనవరి 1 నుంచి మూడు నెలలకోసారి అంటే ఏడాదికి నాలుగు రిటర్నస్ ఫైల్ చేస్తే సరిపోతుంది.
ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వొస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 94 లక్షల మంది చిన్న వ్యాపారస్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఏడాదికి రూ.5 కోట్ల లోపు అమ్మకాలు ఉండే వ్యాపారాలు దీని కిందికి వొస్తాయి.