Take a fresh look at your lifestyle.

ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ పరిహారం వెంటనే చెల్లించాలి

  • కోవిడ్-19 వల్ల  ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రం తెలంగాణ
  • 40వ జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు
  • 40 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు పలు అంశాలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు.  
 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంలోని కన్సాలిడేటెడ్ ఫండ్  లో జమ అయిన 1.76 లక్షల కోట్ల ఐ.జి.ఎస్.టీ మొత్తాన్ని రాష్ట్రాలకు పంచాలని ఇంతకు ముందు నుండి తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తూ వచ్చింది.  అందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు..   కొరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2800 కోట్ల రూపాయాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్  నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పురోగమన దిశలో పయనిస్తోంది. దేశంలో  అతి తక్కువ జీఎస్టీ పరిహారం పొందిన రాష్ట్రం తెలంగాణ. దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలకన్నా ఆదాయ వృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. 2017-18, 2018-19, 2019,-20 సంవత్సరాల్లో చక్కటి వృద్ధిని సాధించింది… కోవిడ్ -19 వల్ల  రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సహకారిగా ఉండాలి.
రాష్ట్రం ఎన్నో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. కోవిడ్ వల్ల ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీని భారీగా కోల్పోయంది.  ఈ ప్రభావం రాష్ట్రంలోని అన్ని రంగాలపై పడనుంది. ఆదాయం పడిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోను కోత విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ  పరిస్థితి నుండి గట్టెక్కాలంటే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన   జీఎస్టీ పరిహార మొత్తం 3975 కోట్లను జూన్ నెలలోనే ఇవ్వాలని కోరుతున్నాం. 15వ ఆర్థిక సంఘం సైతం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులకు కోత పెట్టింది. కేంద్రం నిర్ణయాలు గుదిబండగా మారుతున్నాయి. రాష్ట్రం జీఎస్టీ నిధులు తగ్గితే ఆ నష్టాన్ని పూరిస్తామని ఇచ్చిన మాట మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీఎస్టీ పరిహారం వెంటనే ఇవ్వాలని తెలంగాణ తరపున డిమాండ్ చేస్తున్నాను..’ అని మంత్రి హరీష్ రావు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,  కేంద్ర జీఎస్టీ, రెవెన్యూ శాఖ అధికారులు, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, రాష్ట్రం నుంచి  మంత్రి  హరీశ్ రావు తోపాటు సీఎస్ సోమేష్ కుమార్,  వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి  , అదనపు  కమిషనర్ లక్ష్మినారాయణ, పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!