మరోమారు పర్యటించనున్న కేంద్ర బృందం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ తెలంగాణలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కేంద్ర బృందం పర్యటించనుంది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం మూడు రాష్ట్రాల్లో పర్యటించనుంది. కరోనా వైరస్ నియంత్రణకు కొనసాగు తున్న ప్రయత్నాలను బలోపేతం చేయడం పట్ల రాష్టాధ్రికారులతో కేంద్ర బృందం చర్చించనుంది.హైదరాబాద్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. లాక్‌డౌన్‌కు ముందు నగర పరిధిలో కేసుల సంఖ్య వందలోపు ఉండేది. కానీ, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య వందలలో నమోదవుతుంది. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడంతో.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. నగరంలో బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలామంది నగరం నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 నుంచి 900 కేసులు నమోదవుతుంటే.. ఒక్క హైదరాబాద్ లోనే 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. నగరంలో కరోనా ఎలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే అత్యవసరమైతే తప్ప రోడ్ల దికి రావొద్దని ప్రజలకు పోలీసులు
సూచిస్తున్నారు. జిహెచ్ఎంసిలో మరొకరికి పాజిటివ్తెలంగాణలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. జీహెచ్ఎంసీకి సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బ్యాంకులో క్యాషియర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. కొద్దిరోజులుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించిన క్యాషియర్, ప్రతిరోజు వందమందికి పైగా వేతనాలు చెల్లించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఆఫీసులో ఇప్పటివరకు ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కెసిఆర్ వైఫల్యం వల్లనే కరోనా విజృంభణ: నాగం
తెలంగాణలో కరోనా ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి చెందిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంతో కరోనా విజృంభిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోలేని పరిస్థితి దాపురించిందని, ఇలాంటి పరిస్థితులకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని దుయ్యబట్టారు. అన్ని జిల్లాల్లో కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని, అలాగే ఇంటింటి వైద్య సర్వే చేసి మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో కొరోనాతో భయాందోళనలు
వరుస పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో జిల్లాలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం చెబుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తితో టెన్షన్ పెరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సింగరేణి సంస్థలో కేసులు ఉండవని అంచనా వేస్తున్న క్రమంలో పలువురు కార్మికులకు పాజిటీవ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. వాస్తవంగా కరోనా విషయంలో సింగరేణి కార్మికులు మొదటి నుంచి తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
కెసిఆర్ వైఫల్యం వల్లనే కరోనా విజృంభణ: నాగం
హైదరాబాద్,జూన్25(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో కరోనా ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి చెందిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంతో కరోనా విజృంభిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోలేని పరిస్థితి దాపురించిందని, ఇలాంటి పరిస్థితులకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని దుయ్యబట్టారు. అన్ని జిల్లాల్లో కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని, అలాగే ఇంటింటి వైద్య సర్వే చేసి మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
రాజాసింగ్ సిబ్బందికి కరోనా
టెస్ట్ రిపోర్టులు త్వరగా వచ్చేలా చేయాలన్న ఎమ్మెల్యే
హైదరాబాద్,జూన్25(ఆర్‌ఎన్‌ఎ): కరోనా వైరస్ టెస్ట్‌ల రిపోర్టులను ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 48 గంటల్లో రావాల్సిన రిపోర్టు 5 రోజులైనా రాలేదంటే బాధిత కుటుంబాల్లో అయోమయం నెలకొంటుందన్నారు. తాజాగా రాజాసింగ్ కారు నడిపే ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు గన్‌మెన్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన దగ్గర పనిచేస్తున్న వారంతా భయపడుతున్నారు. ఇప్పటికే రాజాసింగ్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 20న తన దగ్గర పనిచేస్తున్న మరో ఐదుగురికి కూడా కరోనా పరీక్షలు చేయించారు రాజాసింగ్. అయితే వీరి రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 48 గంటల్లో కరోనా రిపోర్ట్ వస్తుందని చెప్పారని, తన గన్మెన్లు టెస్ట్ లు చేనయించుకొసుకొని 5 రోజులైనా ఇంకా రిజల్ట్ రాలేదన్నారు. ఇన్ని రోజులు వరకూ టెస్ట్ రిజల్ట్ రాకపోతే అయోమయం నెలకొంటుందన్నారు. ఒక వేళ పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటని, కుటుంబంలో అందరికీ వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.