Take a fresh look at your lifestyle.

నిరుద్యోగి మనోవేదన….

బతుకు దెరువు కోసం ఇల్లు, ఆకిలి వదిలికన్నపేగుకి బంధాలకు దూరంగా ఎవ్వరు ఎర్కలేని గా పట్నామ్లా బిక్కు బిక్కుమనుకుంటు సర్కారి కొలువు కొట్టాలని బియ్యం ముఠా భుజాన వేసుకొని బయలుదేరిన.
సదువుకుంటే నౌకరు వస్తది నా బిడ్డా  నాలెక్క గొడ్లను కాసుకుంటా దుక్కులు దున్నతు ఎవుసం సేస్తే ఎట్లా ఈ గొడ్డు కట్టం వానితో ఐతదా… యాడాదంతాసేసిన గీ పొలంలో ఏం మిగులుతలేవు. నేను ఎట్లాగూ సదువలేకపోయిన నా కొడుకునైనా సదువియ్యాలే అని బడికి పంపిండు మా నాయిన. సదువంతా సర్కరు బడిలోనే సాగింది. సర్కారి కొలువులో
సేరాలని, ఊళ్లే ఉంటే గొడ్లకాడికే పోతడు వీడు, ఎట్లైనా పట్నం పంపాలే అని మా అయ్యా ఊళ్లో కెళ్లిషావుకారు కాడ అప్పుసేసి పైసల్‌ ‌తెచ్చి ఇచ్చిండు మా నాయిన…. నాయినకు తెల్వకుండా అవ్వ పోపు డబ్బాలలో దాసుకున్న పైసలు సాటుగా తెచ్చియ్యగానే కళ్లలో కన్నీళ్లు తిరిగినయ్‌ ‌నాకు. పైలం బిడ్డా మంచిగా సదువుకో, పైసలు ఎక్కువ ఖర్చు సెయ్యకు పండగ పూట ఓ..పాలి వచ్చిపో అని సెప్తుంటే దుఃఖం ఆగలే నాకు.

బతుకుభారంగా ఐనోళ్లను కాదని పట్నం బాటపట్టి పోతన్నే అవ్వ అని సెప్పగానే అవ్వ కళ్ళలో నీళ్లు తుడసుకుంటూ పైలం బిడ్డా.. యలకు తిను, పైలం మరి పట్నంలో… అని అవ్వ సెప్ప దారి మూల తిరిగే వరకు చూస్తూ ఇంట్లకు పోయింది.
నెత్తిన నాయిన బియ్యం ముఠా ఎత్తుకొని మూడు బాటల దాన్క నాతోని వచ్చి బస్సు ఎక్కించిపోయిండు. ఎందుకో అయ్యావ్వ ఇడిసి పోతుంటే గుండె బరువెక్కిన్నట్లైంది. ఎట్లైనా సర్కారు నౌకరి కొట్టి మా అయ్యావ్వలను మంచిగా సూసుకోవాలె అని గట్టి పట్టుదలతో బయలుదేరిన…

గీ పట్నంల సరిగా ఎలుతురు రాని ఇరుకైనా అర్రలో ఉంటూ జబ్బకు, బుక్కులుఏసుకొని అశోక్‌ ‌నగర్‌ ‌ల కోచింగ్‌ ‌తీసుకుంటు మధ్యాహ్నం పూట ఐదు రూపాయల అన్నపూర్ణ కాంటీన్‌ ‌లో బువ్వ తింటూ వారంతారాల్లో చేతి ఖర్సులకోసం పనికి పోతు సర్కారి కొలువుకోసం సాధన చేస్తూ కన్నోళ్లకు కానరాకుండ, పండుగలకు పోలేక , సూట్టాలకు మొఖం సూపెట్టుకోలేక పట్నామ్లా సదువుకుంటున్న…. మానయన తెచ్చిన పైసలకు ఒక పక్క మిత్తి పెరుగుతాంది కానీ కొలువులు మాత్రం ఏళ్ళు గడిసినా ఇస్తలేరు. నోటిఫికెషన్లు ఇస్తారు అని సూసుకుంటూ సూసుకుంటూ సదువుకుంటా ఉంటిని….. సుడంగా సుడంగ నోటిఫికేషన్లు పడే ఇగ పరీక్ష రాసి కీ పేపర్‌ ‌చూసుకుంటా మురుస్తుంటే తెల్వలేదు.పిడుగు లాంటి వార్త… గా నోటిఫికేన్లన్ని అమ్ముడుపోయిన నోటిఫికేన్లనీ, గప్పుడు నేను కార్చిన ఆనందభాష్పాలు, అవ్వ అయ్య గన్న కలలు… తెల్లారి ఊర్లా మా అయ్యావ్వల కన్నిళ్లవుతాయని ఊహించలే… మా బతుకులన్ని ఎప్పటికీ ఆగం బతుకులే అని తెలుసుకునేందుకు మా చావులే శరణ్యం ఐతాయ్‌ అని అనుకోలేదు….
    – కామగోని శ్రావణ్‌, ‌పీ డీ ఎస్‌ ‌యు నాయకులు, కాకతీయ విశ్వవిద్యాలయం

Leave a Reply