గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ధర్మం, ప్రేమ, సత్యం అనే గుణాలతో జీవితాన్ని సాగించడం నేర్పారన్నారు. రాష్ట్ర ప్రజలు శ్రీరామనవమిని ఇంటివద్దే కుటుంబ సభ్యులతో నిర్వహించుకోవాలని సూచించారు. సామాజిక దూరం, మాస్క్, తరచూ చేతులు కడుక్కోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారానే వైరస్‌ను నిరోధించగలుగుతామని గవర్నర్ భిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు.