Take a fresh look at your lifestyle.

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘ఎక్కడ చూసినా పచ్చదనమే వెల్లివిరి యుచున్నది. ‘‘మొక్కలతోనే ఆరోగ్యవ ంతమైన సమాజ నిర్మాణం ‘‘అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమంతో నిజం చేస్తున్నది. హరితవనాలతో రాబోయే తరాలకు హారిత పుడమిని అందిస్తున్నది.’’

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మానస పుత్రిక ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత విజయాలు సాధిస్తున్నది.సమైఖ్య రాష్టం లో తరిగిపోయిన అడవులు స్వరాష్టంలో దట్టంగా తయా రయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేతుల మీదుగా జూలై మూడున రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది.ఈ పథకం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. దేశంలో అత్యధికంగా మొక్కలు నాటుతున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డులు సృష్టిస్తున్నది. విజయవంతంగా కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంతో తెలంగాణ పుడమి తల్లి ఆకుపచ్చగా మారుతున్నది.ఎక్కడ చూసినా పచ్చదనమే వెల్లివిరియుచున్నది. ‘‘మొక్కలతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ‘‘అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమంతో నిజం చేస్తున్నది. హరితవనాలతో రాబోయే తరాలకు హారిత పుడమిని అందిస్తున్నది.

పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవి హరితవనాలే! హరితవనాలతో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ ‌లభిస్తుంది.కరోనా సంక్షోభం వలన ఆక్సిజన్‌ ‌విలువెంటో ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది.ఉచితంగా ప్రాణవాయువును అందించే చెట్ల ప్రాధాన్యత కూడా అర్థమైంది. భూమిపై పచ్చదనాన్ని పెంచేందుకు చైనా, బ్రెజిల్‌ ‌తర్వాత జరుగుతున్న మూడవ అతి పెద్ద ప్రయత్నం తెలంగాణలోని హరితహారం కార్యక్రమం అని ఐక్యరాజ్యసమితి స్వయంగా పేర్కొంది. పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నది. రాష్ట్రంలో హరితహారం పథకం ద్వారా నిర్దేశిత లక్ష్యాలకు మించి మొక్కలు పెంపకం జరుగుతున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నవి.అడవులు తరగడమే తప్ప పెరగడం తెలియని దేశంలో పచ్చదనాన్ని పెంచి చూపిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.గత ఎనిమిది ఏళ్లలో 8.511 కోట్ల వ్యయంతో 243 కోట్ల మొక్కలు నాటబడ్డాయి. దాదాపుగా 9 లక్షల 65 వేల ఎకరాల అడవుల పునరుద్ధరణ జరిగింది. కనుమరుగయ్యాయను కున్న అనేక జీవరాశులు అడవుల్లో సందడి చేస్తున్నాయి.ఈ మార్పులన్నిటికి కారణం హరిత హరం.హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత పచ్చదనం 7.7 శాతం పెరిగి 31.6 శాతానికి చేరిందని ఫారెస్ట్ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా నివేదికలు స్పష్టం చేస్తున్నవి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌మహానగరం వరుసగా రెండోసారి ‘‘ట్రీ సిటీ ఆఫ్‌ ‌ది వరల్డ్ 2021’’‌గా ఐక్యరాజ్యసమితికి చెందిన ‘‘అర్బర్‌ ‌డే ఫౌండేషన్‌’’ఎన్నిక చేసింది.హైదరాబాదులో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టడంతో నగరవాసుల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగయ్యాయి.దీనితో హైదరాబాద్‌ ‌నగరానికి ఈ అరుదైన గుర్తింపు రెండవసారి కూడా లభించింది. భారత వాణిజ్య రాజధాని ముంబై సహా అమెరికా, బ్రిటన్‌, ‌కెనడా,ఆస్ట్రేలియా తదితర 63 దేశాల నుంచి మొత్తం 130 నగరాలు ఈ గుర్తింపు కొరకు పోటీ పడగా హైదరాబాద్‌ ‌నగరం మాత్రమే విజేతగా నిలిచింది.అర్బన్‌ ‌కమ్యూనిటీ ఫారెస్ట్ ‌లో హైదరాబాద్‌ ‌ప్రపంచంలోని పలు నగరాలకు ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకే ఈ గౌరవం దక్కుతుంది.

2018 జూలై 17న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌హరితహారం స్ఫూర్తితో ప్రారంభించిన’’గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ‌కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతూ పచ్చదనం పెంపుదలకు దోహదం చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు మొక్కలు నాటుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తు స్ఫూర్తినిస్తున్నారు. పచ్చదనం పెంపునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అన్ని వర్గాల భాగస్వామ్యంతో ‘‘గ్రీన్‌ ‌బడ్జెట్‌’’‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది,గ్రీన్‌ ‌బడ్జెట్‌ ‌తో రాష్ట్రంలోని పల్లెలు,పట్టణాలు పచ్చబ డుతున్నాయి.పల్లె, పట్టణ ప్రకృతి వనాలతో ప్రజలు ఆహ్లాద కరమైన స్వచ్ఛమైన వాయువులను పొందు తున్నారు. మొక్కలను ఎంత ఎక్కువగా నాటితే అవి అంతగా మనకు ఆయురా రోగ్యాలను ఇస్తాయి. స్వచ్ఛమైన గాలి తీసుకోవాలన్న, గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌నుంచి మనని మనం కాపాడుకోవాలన్న,ఆరోగ్యంగా జీవించాలన్న ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలి.

‘మిషన్‌ ‌భగీరథ’ ‘మిషన్‌ ‌కాకతీయ’ లాంటి అనేక పథకాల వల్ల కాలేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ ‌ల వలన రాష్టం లోని అన్ని ప్రాంతాల్లో భూగర్బ జలాలు పెరిగాయి. రాష్ట్రం పచ్చగా కళకళలాడనికి,అటవీ ప్రాంతాల విస్తరణకు ఈ పథకాలు కూడా కారణమయ్యాయి. ఈసారి జరుగుతున్న ఎనిమిదవ విడత హరితహారం లో మొత్తం ్న50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు.హరితహారం పుణ్యాన రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నవి.అడవులు పునర్జీవనం పొందుతున్నాయి. డాక్టర్‌ అబ్దుల్‌ ‌కలాం చెప్పినట్లు’’ప్రతి మనిషి తన జీవనానికి కావలసిన ఆక్సిజన్‌ ‌పొందడానికి కనీసం మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి’’.పర్యావరణ పరిరక్షణ, జీవవైవిద్యాన్ని కాపాడాలి. ‘‘పుడమి తల్లికి పచ్చదనమే అందం.సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన పుడమికి మొక్కలే ప్రాణం’’. మొక్కల పెంపకంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది.ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భావితరాలకు ఆకుపచ్చని హరిత తెలంగాణను అందిద్దాం.

pulluru
పుల్లూరు వేణుగోపాల్‌, అసోసియేట్‌ ‌ధ్యక్షులు,టిఎన్జీవోస్‌ ‌యూనియన్‌ ‌హనుమకొండ జిల్లా

Leave a Reply