Take a fresh look at your lifestyle.

గ్రీన్ ఇండియా‌… జంతు సంరక్ష‌ణకి మూడేండ్ల‌లో తెలంగాణ‌కి పైసా ఇవ్వ‌లేదు

గ్రీన్ ఇండియా‌… జంతు సంరక్ష‌ణకి మూడేండ్ల‌లో తెలంగాణ‌కి పైసా ఇవ్వ‌లేదు అని బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి ప్ర‌శ్న‌కి కేంద్రం లోక్‌స‌భ‌లో జవాబు దొరికింది. గ్రీన్ ఇండియా కార్య‌క్ర‌మం… జంతు సంరక్ష‌ణ ప‌థ‌కాని‌కి గ‌త‌ మూడేండ్ల‌లో తెలంగాణ‌కి కేంద్ర ప్ర‌భుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదు అని తేలింది. శుక్ర‌వారం బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి ఎంపీ అర‌వింద్ ప్ర‌శ్న‌కి కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ లోక్‌స‌భ‌లో తెలిపింది. దేశ‌వ్యాప్తంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కి నేష‌న‌ల్ అఫారేస్టేష‌న్ ప్రొగ్రామ్‌(ఎన్ఏపీ), గ్రీన్ ఇండియా మిష‌న్‌(జీఐఎం) అమ‌లు చేస్తున్నామ‌ని…

దాంతోపాటు మ‌నిరేగా వ‌న‌రుల‌ను కూడా వీటిని దేశ‌వ్యాప్తంగా ఉప‌యోగించుకుంటున్న‌ట్టు చెప్పింది. అయితే, తెలంగాణ మొక్క‌ల పెంప‌కంలో దేశంలోనే తొలి స్థానంలోనే ఉన్న‌ప్ప‌టికీ ఆ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా కేటాయించ‌లేదు. జంతుసంర‌క్ష‌ణ సంబంధిత అంశాల్లో కూడా ఏమాత్రం నిధులు కేటాయించ‌లేదు. 2017 నుంచి 2020 వ‌ర‌కు మూడు సంవ‌త్స‌రాల పాటు దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసిన‌ప్ప‌టికీ, తెలంగాణ నిధులు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌కి మాత్రం ఈ ప‌థ‌కాల కింద‌ కేంద్ర నిధులు కేటాయించింది.

Leave a Reply