Take a fresh look at your lifestyle.

‘‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ అత్యద్భుతం’

  • వృక్షవేదం అందరూ చదవాలి
  • ఎంపి సంతోష్‌ను ప్రశంస్తూ లేఖ పంపిన పిఎం మోదీ
  • సంతోష్‌కు మోదీ శుభాకాంక్షలు-థాంక్స్ ‌చెప్పిన ఎంపి సంతోష్‌

హైదరాబాద్‌, ‌మే 28 (ప్రజాంత్ర ప్రత్యేక ప్రతినిధి): టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలందుకున్నారు.  గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌  అత్యద్భుతమైన కార్యక్రమనీ, పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిరేద్దశమనీ, ప్రకృతితో మన అనుబంధాన్ని తెలిపిన పుస్తకం వృక్ష వేదమనీ, దీనిని ప్రతి ఒక్కరూ చదవాలని ప్రేరణ పొందాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి మోదీ గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌వ్యవస్థాపకుడైన ఎంపి సంతోష్‌కుమార్‌ను ప్రశంసిస్తూ ఒక లేఖను పంపారు.

పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కార్యక్రమం అభినందనీయన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌గురించి తెలుసుకున్న తనకు  మనసు ఉప్పొంగిందని, కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు  జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌కు ప్రత్యేకంగా ప్రధానమంత్రి లేఖ రాశారు.  పచ్చదనం పెంచటంతో పాటు, పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ను మొదలు పెట్టి, కొనసాగిస్తున్నందుకు ఎంపికి మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. భూమాతను, ప్రకృతిని పూజించటం ఆది నుంచీ మన సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమని, ఆ స్పూర్తిని ప్రతీ ఒక్కరిలో నింపేలా గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కృషి చేస్తోందన్నారు.

మనమందరమూ భూమాత పిల్లలమే అని, ప్రకృతితో సహజీవనం, సమన్యయం జీవనమార్గం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రకృతి పరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు. సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సహం, కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి, సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌నిషేధం లాంటి చర్యలన్నీ పర్యావరణ రక్షణకు తోడ్పాటును ఇస్తాయన్నారు. గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌విశిష్టతను తెలుపుతూ ఎంపి సంతోష్‌ ‌కుమార్‌ ‌వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి తన లేఖలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సమాజంలోని ప్రతీ ఒక్కరూ, ముఖ్యంగా యువత వృక్షవేదం పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు.గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌లో పాల్గొనటం ద్వారా పచ్చదనాన్ని దేశ వ్యాప్తంగా పెంచాలని ప్రధాని ఆకాంక్షించారు. తద్వారా ఈ కార్యక్రమం మరింత వేగాన్ని, విస్తృతిని అందు కోవాలన్నారు. లేఖ ద్వారా గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌ను అభినందించిన ప్రధాన మంత్రికి ఎంపి సంతోష్‌ ‌కుమార్‌ ‌ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ను మరింత ముందకు తీసుకువెళ్తామనీ సంతోష్‌కుమార్‌ ‌శుక్రవారం ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ తెలిపారు.

 

Leave a Reply