Take a fresh look at your lifestyle.

ఆగ్రీ వర్సిటీ లో డ్రోన్ వినియోగానికి పచ్చ జెండా..!

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: తెలంగాణ అగ్రి వ‌ర్సిటీలో డ్రోన్‌ వినియోగానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. అయితే షరతులతో కూడిన మార్గదర్శకాలు కేంద్రం జారీ చేసింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి డ్రోన్లను వినియోగించుకొనేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ షరతులతో కూడిన మార్గదర్శకాలను జారీ చేసింది.

మొక్కల రక్షణ పరిష్కారాలను పరిశీలించడాని, ప్రామాణీకరణ నిర్ధారించడానికి, అగ్రి స్ప్రేయింగ్‌తో పాటుగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా క్షేత్రాలలో ప్రధాన తెగుళ్ళు, వ్యాధుల నిర్ధారణకు ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేయడానికి శుక్రవారం డ్రోన్‌ వినియోగ మినహాయింపు మంజూరు అయ్యింది. షరతులతో కూడిన ఈ మినహాయింపు వచ్చే ఏడాది మార్చి 16 వరకు కానీ డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫాం(ఫేజ్‌ –1) పూర్తి కార్యాచరణ వరకు చెల్లుబాటు అవుతుంద‌ని మార్గ‌ద‌ర్శకాల్లో కేంద్రం వెల్లడించింది.

Leave a Reply