Take a fresh look at your lifestyle.

సిద్దిపేట అభివృద్ధి పేట… శుద్ధిపేట..

  • ఆకుపచ్చ అవార్డుల్లో ఆదర్శ పేట
  • ఢిల్లీలో అవార్డు అందుకున్న చైర్మన్ , కమిషనర్..

శనివారం రోజున ఢిల్లీ లో ని విజ్ఞాన్ భవన్ లో అవార్డ్ ను సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల , కమిషనర్ రమణా చారి అవార్డు ను ( self sustainable ) అందుకున్నారు.

సిద్దిపేట పుర ప్రజలకు శుభాకాంక్షలు..:మంత్రి హరీష్ రావు ..

సిద్దిపేట పుర ప్రజల ఐక్యత..వారి భాగస్వామ్యం గొప్పదని.. అభివృద్ధి ..అవార్డుల్లో వారు ఎంతో స్పూర్తిని చాటుకున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు..స్వచ్ సర్వేక్షన్ లో దక్షిణ భారత దేశం లోని మొదటి స్థానం లో నిలవడం పట్ల సిద్దిపేట పుర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.. సిద్దిపేట అన్నింటి లో ముందు ఉంది.. స్వయం సమృద్ధిగా ఎదిగింది అని అన్నారు.. వివిధ అంశాల్లో దాదాపు 17 అవార్డులు సాదించనం మరో అవార్డు ఇప్పుడు ఎంపిక కావడం ఇది ప్రజల భాగస్వామ్యం , ప్రజాప్రతినిధులు చొరవ అధికారుల అంకిత భావం అని చెప్పారు.. స్వచ్ సర్వేక్షన్ లో ఏ కార్యక్రమం చెపితే..పిలుపు ఇస్తే ఎంతో చైతన్యాన్ని చూపారాని చెప్పారు… ఇదే స్ఫూర్తి తో పట్టణాన్ని మరింత అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలని మన అందరి కృషి ఫలితంగా మరిన్ని అవార్డ్ లు సాధించాలని చెప్పారు..

swatchh city awards

మంత్రి హరీష్ రావు స్పూర్తి.. ప్రజల చైతన్యం.. – మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు.. కమిషనర్
సిద్దిపేట లో అభివృద్ధి లో కానీ..ఏ కార్యక్రమం చేయాలి అని కానీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన స్పూర్తి ఎంతో ఉంది అని..స్వచ్ సర్వేక్షన్ లో మంత్రి గారి సూచనలు..సహాలహాలు వారు ఇచ్చిన స్పూర్తి , ప్రజల భాగస్వామ్యం మున్సిపల్ అధికారులు పని తీరు కు నిదర్శనం అని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు మరియు కమిషనర్ రమణాచారి తెలిపారు.

Leave a Reply