Take a fresh look at your lifestyle.

ఘనంగా మహాశివరాత్రి జాగారణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Greatly Mahashivaratri Special arrangements for vigil

మణుగూరు సబ్‌ ‌డివిజన్‌లో మహాశివరాత్రి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుండి పవిత్ర స్నానాల కోసం గోదావరికి వెళ్లారు.స్నానాల అనంతరం మణుగూరులో ఉన్న కాకతీయుల నాటి శివాలయాన్ని, కొండాయి గూడెంలో ఉన్న శివాలయాన్ని ప్రజలు అధిక సంఖ్యలో దేవున్ని దర్శించుకున్నారు.ఈ సందర్బంగా సింగరేణి జియం జక్కం.రమేష్‌ ,‌సివిల్‌ ‌డిజియం వెంకటేశ్వర రావు,మణుగూరు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మిక కుటుం బాలు,ప్రజలతో దేవాలయాలు కిటకిట లాడాయి.ప్రత్యేక దుకాణాలతో ఆకర్షించే బొమ్మలు ఎంతో ఆకట్టున్నాయి.కొండాయిగూడెం లో ఉన్న శివాలయంలో ,ప్రసిద్ది చెందిన మణుగూరు శివాలయంలో జాగరణ కోసం సాంస్కృతిక కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. సినిమాహాళ్లలో ఒక్క టిక్కెట్‌పై రెండు సినిమాలు ప్రదర్శించేందుకు యాజమాన్యాలు సిద్దమయ్యాయి.శివపార్వతుల కళ్యాణానికి ఆలయ కమీటీలు భారీగా ఏర్పాట్లు చేశారు.కళ్యాణం కోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు నిర్వహించింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మణుగూరు ఎస్‌హెచ్‌ఓ ‌షుకురు ఆధ్వర్యంలో పోలీస్‌లు జాగ్రత్తలు తీసుకున్నారు.

Leave a Reply