Take a fresh look at your lifestyle.

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

మధిర,  జూన్‌ 20 (‌ప్రజాతంత్ర విలేకరి): మధిర మున్సిపాల్టీ పరిధిలోని 18వ వార్డులో కౌన్సిలర్‌ అరిగె రజిని ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని కాల్వలను రాజమండ్రి పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. అనంతరం మాట్లాడుతూ 18వ వార్డు అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ ‌వ్యాధులు రాకుండా ఉండేందుకు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డు ప్రజలు సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ ‌పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Leave a Reply