Take a fresh look at your lifestyle.

ప్రమాదకరంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌రోడ్లు

‘‘అం‌బులెన్సు లు ఈ గల్లీలలో కూరగాయల సంతల వేళ రాకపోకలు సాగించడం తీవ్రమైన కష్టతరముగా ఉంటున్నది. ఈ సంతలలో ఎక్కువగా స్త్రీలే కూరగాయలు కొనడం వలన ఆకతాయిలు వీరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తెలియవస్తున్నది మరియు కొన్ని సందర్భాలలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు సైకిళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగించడం వలన ప్రమాదం జరిగి ఘర్షణలకు తావిస్తున్నది.’’

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోని ఫుట్‌ ‌పాత్‌ ‌లు ఆక్రమించుకొని వివిధ రకములైన వస్తువులు మరియు పండ్లు ఫలాలు అమ్మడం జరుగుతున్నది. ఇంకా ఇదే కాక నగరంలోని ఉన్న ప్రతి కాలనీలలో ప్రధాన రోడ్ల పైన గల్లీ రోడ్ల పైన నిత్యం కూరగాయలు అమ్మకాలు జరుపుతున్నారు. దీనికి అదనంగా ఆయా కాలనీలలో వారానికి ఒకసారి కూరగాయల వారాంతపు సంత నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి లారీలలో వ్యానులలో బట్టలు ఇతర వస్తువులు పండ్లు ఫలాలు తెచ్చి రోడ్లపైనే అమ్మకాలు జరుపుతున్నారు. ఇంకా రోడ్లపై ఇతర గృహ అవసర వస్తువులను కూడా అమ్మకాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో వందలాది వాహనాలతో రోడ్లు అనుక్షణం రద్దీతో ఉంటుంది. దీనికి తోడు ఫుట్‌ ‌పాతులపై, రోడ్లపై వ్యాపారులు చేయడం వలన అనేక సమస్యలకు ప్రమాదాలకు దారితీస్తున్నది. ఇక మనుషులు నడవడం క్లిష్టతరముగా అత్యంత ప్రమాదకరంతో జరుగుతున్నది. ఈ ఫుట్‌ ‌పాతులపై రోడ్లపై వ్యాపారం సాగడంవలన కొనేవారు రోడ్లపై తమ వాహనాలు నిలపడం వలన ప్రమాదాలకు దారితీస్తున్నది ఫలితంగా వాహన రాకపోకలకే కాక మనుషులకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. ఇక కూరగాయలను రోడ్డుపై మూల మలుపులవద్ద డ్రైనేజీ చాంబర్లపై అమ్మడం జరుగుతున్నది. అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో కూడా ఈ అమ్మకాలు నిర్వహిస్తున్నారు.

మనం పాదాలకు ధరించే పాదరక్షలను మాత్రం ఏసీ రూములలో జిగేలుమనిపించే అద్దాల మేడలలో కొంటున్నం. కానీ మనం భుజించే కూరగాయలను మాత్రం రోడ్లపై అశుభ్రమైన స్థలాల్లో కొంటున్నాము. ఈ సంతలను చాలా చోట్ల రోడ్లపై ఇరుప్రక్కలలో అమ్మడం జరుగుతుంది ఫలితంగా రాకపోకలు జరపడం అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నది . అనేక ప్రదేశాలలో ఆరోజు వాహనాలు వారి వారి ఇండ్లకు పోవడం కూడా జరగడం లేదు. ఆయా వాహనలను ఇతర ప్రదేశాలలో నిలపడంవలన అక్కడ వాహనాల రద్దీ పెరిగి రాకపోవులకు తీవ్రమైన అంతరాయంగా మారుతున్నది మరియు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు ఇతర రోగులు వైద్యశాలలకు వెళ్లడం కూడా అత్యంత ఇబ్బందికరంగా ఉంటున్నది. అంబులెన్సు లు ఈ గల్లీలలో కూరగాయల సంతల వేళ రాకపోకలు సాగించడం తీవ్రమైన కష్టతరముగా ఉంటున్నది. ఈ సంతలలో ఎక్కువగా స్త్రీలే కూరగాయలు కొనడం వలన ఆకతాయిలు వీరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తెలియవస్తున్నది మరియు కొన్ని సందర్భాలలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు సైకిళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగించడం వలన ప్రమాదం జరిగి ఘర్షణలకు తావిస్తున్నది. మనుషుల మధ్య కూడా కొన్ని సందర్భాలలో అనుకోని ఘర్షణలు సంఘటనలు జరుగుతున్నవి. ప్రస్తుత వర్షాకాలంలో ఈ రోడ్లపై ముఖ్యంగా కూరగాయలు రోడ్లపై పరిచి అమ్మడం వలన మురికినీటి వరద వీటిపై ప్రవహిస్తున్నది. అందువలన ఈ కూరగాయలు చెడిపోయి అమ్మేవారు కూడా నష్టం చవిచూడవలసి వస్తున్నది. చాలామంది ఇవే కూరగాయలను కూడా విధి లేని పరిస్థితుల్లో కొనడం జరుగుతున్నది.

నగరంలో రద్దీని నివారించుటకు అనేక చోట్ల ఫ్లైఓవర్లు,అండర్‌ ‌పాసులు స్కై వేలు పాదాచారుల పై వంతెనలు నిర్మించినారు మరియు నిర్మిస్తున్నారు కూడ. ఇంకా ఇవే కాక వాహనాల రద్దీ సాఫీగా సక్రమంగా జరుగుటకు దాదాపు అన్ని కూడలల్లో అత్యాధునిక సిగ్నల్‌ ‌వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంతేకాక అవసరమైన చోట కూడా ఏర్పాటుకు తగువిధంగా సన్నహాలు చేస్తున్నారు. కానీ ఈ ఫుట్‌ ‌పాతులపై రోడ్లపై జరుపుతున్న వ్యాపారాలు నిలుపుదల చేయుటకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనపడడం లేదు. రాజకీయ నాయకులు అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులు పోలీస్‌ ‌వ్యవస్థ, మేధావులు దీనిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదని కనబడుతున్నది. ఎన్నో ఎన్నో అత్యంత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం మన ప్రభుత్వాలు ఇతర వ్యవస్థలు చూపుతున్నవి. కానీ ఈ వ్యాపార కార్యకలాపాల్లో ఎలాంటి చర్యలు తీసుకొనడం లేదు. ఈ రోడ్లపై వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ప్రత్యేక ప్రదేశాలలో దుకాణాలు ఏర్పాటు చేసి వారి ఉపాధి కూడా దోహదం చేయాలి మరియు వీటిని నెలకొల్పుటకు వారికి ఆర్థికంగా తగు విధముగా సహాయ సహకారాలు అందించాలి తద్వారా మనందరం కూడా నాణ్యమైన వస్తువులను కొనుక్కొని మరియు పరిశుభ్రమైన కూరగాయలు భుజించి ప్రమాదాలు లేని రహదారులను ఏర్పరచుకొని ఆరోగ్యవంతమైన గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌కు ప్రతి ఒక్కరూ తగు విధముగా తోడ్పడాలి అందుకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించాలి.
– దండంరాజు రాంచందర్‌ ‌రావు, రిటైర్డ్ ‌డిప్యూటీ సూపరింటెండెంట్‌, ‌సింగరేణిభవన్‌, ‌హైదరాబాద్‌, 9849592958

Leave a Reply