Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌లో భారీగా తగ్గిన పోలింగ్‌

  • 40‌శాతంలోపే ఉంటుందన్న అధికారులు
  • చెదురు ముదు ఘటనలు మినహా ముగిసిన పోలింగ్‌
  • ‌పలు చోట్ల ఘర్షణలు..పరస్పర దాడులు
  • గుర్తు తారుమారుతో ఓల్డ్ ‌మలక్‌పేట్‌ ‌డివిజన్‌ 26‌లో పోలింగ్‌ ‌రద్దు

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ‌ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ‌సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే చాలా కేంద్రాల్లో వోటర్లు లేక పోలింగ్‌ ‌సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్‌.. ‌మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌ ‌శాతం దారుణంగా పడిపోయింది. ఐటీ కారిడార్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ‌ప్రశాంతంగా జరిగింది. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ ‌మలక్‌పేట్‌ ‌డివిజన్‌లో మాత్రమే రీ పోలింగ్‌ ‌జరగనుంది. డిసెంబర్‌ 3‌న రీపోలింగ్‌ ‌నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్‌ 4‌న ఎన్నికల కౌంటింగ్‌ ‌జరగనుంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ ‌మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకున్నది. 149 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ 50 ‌శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్‌ 15 ‌శాతం కూడా చేరకపోవడం గమనార్హం. కొరోనా భయం, వరుసగా సెలవులు రావడం, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోం చేస్తుండటంతో నగరవాసులు వోటు వేయడానికి రాలేకపోయారని అంచనా వేస్తున్నారు. ఈ సారి యువతకు పోటీగా వృద్ధులు, వికలాంగులు వోటు వేయడానికి కేంద్రాలకు తరలివచ్చారు. పలు చోట్ల ప్రధాన పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాతబస్తీలో అనేక చోట్ల పోలింగ్‌ ‌బూత్‌లు ఖాళీగా దర్శన మిచ్చాయి.

పాతబస్తీ అంతటా 25 శాతం పోలింగ్‌ ‌మించలేదని అధికారులు అంటున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా తక్కువ శాతం పోలింగ్‌ ‌నమోదు అయింది. పలు పోలింగ్‌ ‌కేంద్రాలలో ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 29.76 శాతం పోలింగ్‌ ‌మాత్రమే నమోదు అయింది. లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్‌ ‌నమోదు అయింది. అత్యధికంగా బాగ్‌అం‌బర్‌పేట్‌ 64.82 ‌శాతం, అత్తాపూర్‌ 54.95, ‌బంజారాహిల్స్ 35.50, ‌జూబ్లీహిల్స్ 30.08 ‌శాతం, శేరిలింగంపల్లి సర్కిల్‌ 22.80, ‌చందానగర్‌ ‌సర్కిల్‌ 22.55 ‌శాతం. కూకట్‌పల్లి సర్కిల్‌ 26.04, ‌రామచంద్రాపురం సర్కిల్‌ 21.71 ‌శాతం. రామచంద్రాపురం, పటాన్‌చెరు సర్కిల్‌ 51.71, అం‌బర్‌పేట్‌ ‌సర్కిల్‌ 42.49 ‌శాతం. ఉప్పల్‌ 37.01, ఎల్బీనగర్‌ 37.01, ‌గాజులరామారం 36.65, అల్వాల్‌ 36.44 ‌శాతం, రాజేంద్రనగర్‌ 35.45, ‌హయత్‌నగర్‌ 34.79, ‌చార్మినార్‌ 34.75 ‌శాతం. మూసాపేట్‌ 34.25, ‌ముషీరాబాద్‌ 32.93, ‌మల్కాజ్‌గిరి 30.56, జూబ్లీహిల్స్ 30.45 ‌శాతం అయింది. యూసుఫ్‌గూడ 29.66, సికింద్రాబాద్‌ 29.15, ‌గోషామహల్‌ 28.72 ‌శాతం, ఖైరతాబాద్‌ 28.63, ‌కుత్బుల్లాపూర్‌ 28.41, ‌సనత్‌నగర్‌ 27.51 ‌శాతం చాంద్రాయణగుట్ట 26.88, మెహిదీపట్నం 26.88, సరూర్‌నగర్‌ 26.61 ‌శాతం, బేగంపేట్‌ 26.19, ‌కూకట్‌పల్లి 26.04, కాప్రా 25.43, శేరిలింగంపల్లి 22.80 శాతం, చందానగర్‌ 22.55, ‌ఫలక్‌నుమా 22.53, కార్వాన్‌ 20.35 ‌శాతం, అత్యల్పంగా మలక్‌పేట్‌ ‌సర్కిల్‌లో 18.86 శాతం పోలింగ్‌ ‌నమోదు, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల పోలింగ్‌ ‌కాసేపట్లో ముగియనుంది. గత పోలింగ్‌ ‌శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 2016 జీహెచ్‌ఎం‌సీ పోలింగ్‌ ‌శాతం 45.29 పోలింగ్‌ ‌నమోదు అయింది. ఈసారి 40 శాతంలోపే వోటింగ్‌ ఉం‌టుందందని ఎన్నికల అధికారులు అంటున్నారు.

పలు చోట్ల ఘర్షణలు..పరస్పర దాడులు
బంజారాహిల్స్ ఎన్జీటీనగర్‌ ‌పోలింగ్‌ ‌కేంద్రం వద్ద కొంత ఉద్రిక్తత ఏర్పడింది. భాజపా కార్యకర్తలు కాషాయ మాస్కులు ధరించారని తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలు చేతులకు గులాబీ కంకణాలు కట్టుకున్నారని భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల వారినీ చెదరగొట్టారు. మాదాపూర్‌లో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు దొర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. మాదాపూర్‌ ‌డివిజన్‌ ‌పోలింగ్‌ ‌బూత్‌లలో పోలీసుల సాయంతో వోటర్లకు టీఆర్‌ఎస్‌ ‌నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ మండిపడింది. డబ్బుల పంపిణీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఓల్డ్ ‌మలక్‌పేట్‌ ‌డివిజన్‌ 26‌లో పోలింగ్‌ ‌రద్దు అయింది. మలక్‌ ‌పేట డివిజన్‌ ‌బ్యాలెట్‌ ‌పేపరులో గుర్తు మారిన అంశాన్ని సిపిఐ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. సీపీఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డివిజన్‌లో ఎన్నికల సంఘం పోలింగ్‌ను రద్దు చేసింది. ఓల్డ్ ‌మలక్‌పేట్‌లో సీపీఐ గుర్తు బదులుగా సీపీఎం గుర్తు వొచ్చింది. ఈసీ గుర్తులు పరిశీలించి పోలింగ్‌ ‌రద్దు చేసింది. కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తికొడవలి నక్షత్రం గుర్తు రావడంతో ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఓల్డ్ ‌మలక్‌పేట్‌లో 1, 2, 3, 4, 5 పోలింగ్‌ ‌కేంద్రాల్లో వోటింగ్‌ను నిలిపివేశారు. ఈ పోలింగ్‌ ‌కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

పటాన్‌చెరు భారతి నగర్‌ ‌డివిజన్‌ ఎల్‌ఐజీ కాలనీలో సొసైటీ ఆఫీస్‌ 111‌వ నెంబర్‌ ‌బూత్‌ ‌వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఆదర్శ్ ‌రెడ్డి ఫోటోతో కూడిన పోలింగ్‌ ‌స్లిప్‌ల పంపిణీపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూన్నారంటూ ఆరోపించారు. పటాన్‌చెరు డివిజన్‌లోని చైతన్య కాలనీ పోలింగ్‌ ‌బూత్‌ ‌వద్ద బీజేపీ కార్యకర్త నర్సింగ్‌పై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి తనయుడు విష్ణు వర్ధన్‌ ‌రెడ్డి చెయ్యిచేసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎమ్మెల్యే సతీమణి కుమారుడు విష్ణువర్ధన్‌ ‌రెడ్డిని అక్కడనుంచి తీసుకెళ్ళింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని గొడవ జరగకుండా ఆపారు. బీజేపీ కార్యకర్త నర్సింగ్‌ను పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ ‌సమయంలో హఫీజ్‌ ‌పేట డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి ఫోటోలు ప్రదర్శిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్రమైన తోపులాటకు దారితీసింది. చివరకు టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్లెక్సీలు తొలగించడంతో.. బీజేపీ కార్యకర్తలు శాంతించారు. ఎల్బీనగర్‌ ఆర్కేపురం డివిజన్‌ ‌బూత్‌ ‌నెంబర్‌ 42, 45‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ర్‌ ‌పేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ మేయర్‌ ‌విక్రమ్‌రెడ్డి వోటర్లను ప్రలోభాలు పెడుతున్నాడని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.

Leave a Reply