Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌లో మేయర్‌ ‌పీఠం కైవసానికై కీలకంగా మారనున్న ఎక్స్అఫిసియోవోట్లు

“గ్రేటర్‌ ఎన్నికలలో మేయర్‌ ‌పీఠాన్ని దక్కించుకోవాలంటే, ఇప్పుడు ఎక్స్ అఫిసియో వోట్లు కీలకంగా మారాయి. ఏ పార్టీ సొంతంగా మ్యాజిక్‌ ‌ఫి•గర్‌ ‌సాధించాలన్న ఎక్స్ అఫిసియో వోట్ల సహాయం తీసుకునే పరిస్థితి రావచ్చు. సాధారణంగా, అసెంబ్లీ, లోక్‌సభ• ఎన్నికల్లోమ్యాజిక్‌ ‌ఫి•గర్‌ ‌సాధించాలంటే ఉన్న మొత్తం స్థానాల్లో సగం సీట్ల కన్నా ఒక్క సీటు ఎక్కువగా సాధించాల్సి ఉంటుంది. కానీ మున్సి పల్‌ ‌కార్పొ రేషన్ల ఎన్నికల విషయంలో ఈ నిబంధన వేరుగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అఫిషియో వోట్లు కూడా తోడవుతాయి, కాబట్టి మ్యాజిక్‌ ‌ఫి•గర్‌ ఈ ‌వోట్లపై ఆధారపడి ఉంటుంది.”

ఉదాహరణకు, తాజా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. అలాగే నగర పరిధిలో మొత్తం 52 ఎక్స్ అఫిషియో వోట్లు ఉన్నాయి. ఈ రెండు కలిపితే మొత్తం సంఖ్య 202. కాబట్టి మేయర్‌ ‌పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీకైనా, మ్యాజిక్‌ ‌ఫి•గర్‌ అయిన 101 స్థానాలను సాధించాల్సి ఉంటుంది. ఒకరకంగా పరోక్షంగా మేయర్‌ ‌పీఠాన్ని దక్కించుకునేందుకు ఎక్స్అఫిషియోవోట్లు కీలకం కానున్నాయి. గ్రేటర్‌ ‌పరిధిలో ఎక్స్అఫిషియో వోట్లు,  మొత్తం 52 ఉన్నాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 38, ఎంఐఎంకు 10, బీజేపీకి 03, కాంగ్రెస్‌ ‌పార్ట్టీకి 01 ఉన్నాయి. ఒక రకంగా ఇది అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి కలిసొచ్చే అంశం. ఆ పార్టీకి గ్రేటర్లో 35 ఎక్స్ అఫిషియోవోట్లు ఉండగా, ఇటీవల గవర్నర్‌ ‌కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీల ఎక్స్అఫిషియోవోట్లను కూడా కలుపు కుంటే ఆసంఖ్య 38కి చేరనుంది.

అంటే, గ్రేటర్‌లో మేయర్‌ ‌పీఠాన్ని దక్కించుకోవాలంటే టీఆర్‌ఎస్‌ అదనంగా మరో 64 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకంటే తక్కువ స్థానాలు వచ్చినా, ఎంఐఎంకి ఎలాగూ 10 ఎక్స్ అఫిషియో వోట్లు ఉన్నాయి కాబట్టి అవి కూడా టీఆర్‌ఎసా?తా లో చేరే అవకాశం లేకపోలేదు. దీంతో ఎన్నికల్లో ఒకవేళ అంచనాలు తలకిందులైనా టీఆ ర్‌ఎస్‌ ‌పెద్దగా టెన్షన్‌ప డాల్సిన అవసరం లేకుండా ఎక్స్ అఫిషియో వోట్లతో మేయర్‌ ‌పీఠాన్ని దక్కించు కోవచ్చు.
గ్రేటర్లో బీజేపీకి ఆ పార్టీ ఎంపీ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావుల ఎక్స్ అఫీషియో వోట్లు జతకానున్నాయి. అయితే కేవలం 3 ఎక్స్ అఫీషియో వోట్లు మాత్రమే ఉండటంతో బీజేపీ మేయర్‌  ‌పీఠాన్ని దక్కించుకోవాలంటే 99 డివిజన్లలో గెలవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో సెంచరీ మార్క్ ‌దాటుతామని ఆ పార్టీ ధీమాగా చెబుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఎక్స్ అఫీషియోతో సంబంధం లేకుండా గ్రేటర్‌ ‌పీఠాన్ని దక్కించుకోవచ్చు. కానీ అంచనాలు తలకిందులైతే మాత్రం ఆ పార్టీ గట్టెక్కేందుకు ఎక్స్ అఫీషియో వోట్లు కూడా లేవు. ఈ లెక్కన ఎక్స్ అఫీషియో వోట్లు బీజేపీకి ప్రతికూలంగా మారాయనే చెప్పాలి.

గ్రేటర్‌ ‌పరిధిలో ఎంఐఎంకి 10 ఎక్స్ అఫిషియో వోట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాలను దక్కించుకుంది. సొంతంగా మేయర్‌  ‌పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల్లో ఫలితం తేడా కొట్టి టీఆర్‌ఎస్‌కు ఎక్స్ అఫిషియో వోట్లు అవసరమైతే, ఎంఐఎం అధికార పార్టీకి మద్దతు తెలుపుతుందనడంలో సందేహం అక్కర్లేదు. నిజానికి గత ఎన్నికల్ల 99 స్థానాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌కు ఈసారి సొంతంగా 64 స్థానాలు గెలుచుకోవడం పెద్ద లెక్కేమీ కాకపోవచ్చు. ఆ లెక్కన ఈసారి కూడా గ్రేటర్‌ ‌పీఠం టీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక గ్రేటర్‌ ‌పరిధిలో అన్ని పార్టీల కంటే బలహీనంగా కనిపిస్తున్నది కాంగ్రెస్‌ ‌పార్టీ. 2009 జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో 54 స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ 2016లో మాత్రం కేవలం రెండంటే రెండు స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఆ పార్టీకి గ్రేటర్‌ ‌పరిధిలో కేవలం ఒకే ఒక్క ఎక్స్ అఫిషియో వోటు ఉంది. ఈ లెక్కన మేయర్‌ ‌పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆ పార్టీ 101 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఇటీవలి దుబ్బాక ఉపఎన్నిక ఫలితంతో ఢీలా పడ్డ ఆ పార్టీకి గెలుపు కంటే ఉనికిని చాటుకోవడమే ఇప్పుడు కీలకంగా మారింది. గ్రేటర్‌ ‌పరిధిలో ఆ పార్టీ పదుల సంఖ్యలో స్థానాలు సాధిస్తేనే రాజకీయంగా తిరిగి పుంజుకునే అవకాశాలు ఉంటాయి.

డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply