Take a fresh look at your lifestyle.

నేటితో ముగియనున్న గ్రేటర్‌ ‌ప్రచారం

పతాక స్థాయికి చేరిన పార్టీల ప్రచారం
ఎన్నికల అనంతర కార్యక్రమాలపై వ్యూహాలు
నేటి సాయంత్రం 6గంటలకల్లా ప్రచారం ముగింపు : రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్‌ ‌స్పష్టీకరణ

‌గ్రేటర్‌ ఎన్నికలకు మంగళవారం పోలింగ్‌ ‌జరగనున్న నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం పరిసమాప్తం కానుంది. ఆదివారం
సాయంత్రం వరకు సమయం ఉండడంతో నగరంలో వివిధ డివిజన్లలో పార్టీలు ప్రచారన్ని ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే నోటిఫికేషన్‌ ‌నుంచి పోలింగ్‌ ‌వరకు 15 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థుల కంటే ఎక్కువగా పార్టీల స్టార్‌ ‌క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మాటల తూటాలు పేలాయి. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, కాంగ్రెస్‌, ‌టీడీపీలు ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలిపాయి. పట్టు నిలుపుకునే దిశగా కొన్ని పార్టీలు..పూర్వ వైభవం కోసం మరి కొన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఎంఐఎం గతం కంటే ఎక్కువ సీట్లే తమ లక్ష్యం అని చెబుతోంది. నేడు, రేపు నగరంలో ప్రముఖ నాయకుల ప్రచారాలున్నాయి.

ప్రచారానికి శని, ఆదివారాలు కీలకం కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ తమ గుర్తును మరవొద్దని చెబుతున్నారు. బ్యాలెట్‌ ‌పత్రంలో తమ పార్టీ గుర్తు ఎక్కడుందో చూపే కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. పాటలు, కళా బృందాల ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు డివిజన్‌లో తటస్థ వోటర్ల వివరాలు సేకరిస్తూ వారి మద్దతు సాధిస్తే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నారు.
నేటి సాయంత్రం 6గంటలకల్లా ప్రచారం ముగింపు : రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్‌ ‌స్పష్టీకరణ
గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌స్పష్టం చేసింది. గ్రేటర్‌ ‌పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. కాగా ఎన్నికల కమిషన్‌ ‌నిబంధనలను పాటించని రాజకీయపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ ‌కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీహెచ్‌ఎం‌సి యాక్ట్, 1955 ‌ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే 48గంటల్లో ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు, అభ్యర్ధులు ఎన్నికల కమిషన్‌ ‌విధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

Leave a Reply