మధిర, జూన్ 25 (ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మధిర పట్టణం, మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మధిర మున్సిపాల్టీ పరిధిలోని 2వ వార్డులో జరిగిన హరితహరం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగా ల కమల్రాజు ముఖ్యఅతిధిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మనుగడ సాధ్యం కావా లంటే చెట్లు పెంచటం ఎంతో అవసరమని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సిఎం కేసిఆర్ పిలుపులో భాగంగా ప్రతిఒక్కరూ హరితహరంలో భాగస్వామ్యులై తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు.
అదేవిధంగా మండల పరిధిలోని సిరిపురంలో లింగాల మొక్కలు నాటారు. అలాగే మధిర మండలం లోని గ్రామాల్లో ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపిటిసిలు, అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపాల్టీ చైర్పర్సన్ మొండితోక లత, ఇన్చార్జి కమీషనర్ డి.సైదులు, ఎంపిపి మెండెం లలిత, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యద ర్శులు దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు, మండ ల అధ్యక్ష, కార్యదర్శులు రావూరి శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వర రావు, జిల్లా నాయకులు మొండితోక జయాకర్, భరత్ వెంకటరెడ్డి, బిక్కికృష్ణప్రసాద్, కరివేద వెంకటేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కోఠారి రాఘవరావు, ఇక్బాల్, యర్రగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.