విశ్వశాంతి దూత.. ప్రేమైకమూర్తి.. దేవుని కుమారుడు భూమిద అడుగుపెట్టిన ఈ శుభదినాన్ని ప్రపంచం మొత్తం ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి నుండే క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగగా, ప్రఖ్యాత ప్రార్థనామందిరాలు.. కైస్త్రవుల ఇండ్లు, కూడళ్ల వద్ద క్రీస్తురాకకు ప్రతీకలుగా నక్షత్రకాంతులీనుతున్నాయి. క్రిస్మస్ వేడుకని టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు జరుపుకుంటూనే తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తమ ట్విట్టర్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని తెలిపారు.ఇక బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా లండన్‌లో తన భర్తతో కలిసి క్రిస్మస్ వేడుకు జరుపుకుంది. అలానే అందరికి శుభాకాంక్షలు తెలిపింది.
కరీనా కపూర్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురువారం అర్థరాత్రి నుంచే చర్చిల్లో క్రిస్మస్ సందడి నెలకొన్నది. నగరంలోని సికింద్రాబాద్‌లోని సెయింట్‌మేరీ, వెస్లీ చర్చిల్లో వేకువజాము నుంచే క్రిస్మస్ సంబురాలు నిర్వహించారు. ఏకుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి విద్యుద్దీపాల వెలుగుల్లో విరాజిల్లింది. ఏసుక్రీస్తు పుట్టినరోజుకు గుర్తుగా జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
అర్ధరాత్రి నుంచే పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్మాన్ రాజు ఆరాధన ఏసు సందేశాలు అందించారు. అదేవిధంగా వరంగల్, సంగారెడ్డి, గజ్వేల్ పట్టణంలోని బాలయేసు పుణ్యక్షేత్రంలో, జహీరాబాద్ చర్చిల్లోనూ క్రైస్తువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. చర్చి పాస్టర్‌తో కలిసి క్రిస్మస్ కేక్ కట్‌చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ కైస్త్రవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.