Take a fresh look at your lifestyle.

గ్రామ స్వరాజ్యం కేసీఆర్‌ ‌కే సాధ్యం…!

“‌గ్రామ పంచాయతీలో మౌళిక సదుపాయాల రూపకల్పన కోసం పల్లే ప్రగతి పథకం అమలుకోసం,మండలానికిఒక అధికారి,గ్రామ,గ్రామాన వారోత్సవాల పేరిట సిబ్బందిని నియమించి,గంగదేవిపల్లి,అంకాపూర్‌ ‌గ్రామాలను ఆదర్శంగా తీసుకున్నట్లయితే ప్రతి గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని నాడు మహాత్మగాంధీ దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తే,నేడు తెలంగాణ రాష్ట్రం కోసం అహింస మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన అద్వితీయుడు నేటి గాంధీ కేసీఆర్‌..‌గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ పల్లెల్లోనిర్మించి,అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదాల్చిన తెలంగాణ గాంధీ కేసీఆర్‌ ‌వేస్తున్న ప్రతి అడుగు బంగారు తెలంగాణ దిశగా ప్రగతిపథంలో నడుస్తుండడం ముదావహం..”

స్వాతంత్య్రానికి,సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు కల్పించాలని,మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్‌ ‌చేపట్టిన పల్లె ప్రగతికి నిలువెత్తు నిదర్శనం .తెలంగాణ ఏర్పడ్డాక 70 సంవత్సరాలుగా చితికిపోయి శిథిలావస్థకు చేరుకున్న రైతులకు వ్యవసాయమే ప్రాణధారమని నమ్మి కాకతీయుల కాలం నాటి ఊరి చెరువుల మరమ్మతుకోసం 46 వేల చెరువుల పూడికలు తీయడంతో ప్రతి వర్షపు చుక్కను వృధా కాకుండా నిండుకుండలా గ్రామాలలో కేసీఆర్‌ ‌దార్శినికతతో జళ కళ వచ్చేసింది.పరిశుభ్రత,డంపుయార్డ్,‌నర్సరీలు,వైకుంఠధామం పచ్చలహారంతో పల్లేలు సుందర దృశ్యంగా అవిష్కృతం అయ్యింది. గ్రామాల అభివృద్ధి కోసం వార్షిక ప్రణాళిక రూపొందించుకుని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి,ప్రజల భాగస్వామ్యంతో,అభివృద్ధి లక్ష్యంగా గ్రామాలకు మహర్దశ తీసుకొచ్చి,గ్రామ సీమలను సుసంపన్నం చేసేందుకు కేసీఆర్‌ ‌రూపొందించిన అనేక పథకాలు పల్లే ప్రగతి కి అనువైనవే. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ప్రజాప్రతినిధులు,ప్రభుత్వాధికారులు సమన్వయంతో కలిసికట్టుగా ప్రజలను భాగస్వాములను చేయాలి. ప్రజలు కూడా తమ బాధ్యతలను గుర్తించాలి. గ్రామస్థాయిలో ఈ పరివర్తన చోటుచేసుకుంటే మొత్తం తెలంగాణ సమాజమే మారిపోతుంది. గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీలు ఏ బాధ్యతలు లేకుండా నిధులను ఉపయోగించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు గ్రామాభివృద్ధి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు జవాబుదారీతనం తప్పడంలేదు.ప్రజల భాగాస్వామ్యంతో జాతిపిత గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం నిర్మించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తో మాత్రమే సాధ్యమైందని మేధావుల అభిప్రాయం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామం అభివృద్దే లక్ష్యంగా ప్రారంబించిన పల్లె ప్రగతి పథకం గ్రామీణ ప్రాంతాలలో అన్ని మౌళిక సదుపాయాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది,ఉమ్మడి రాష్ట్రంలో ఏలాంటి అభివృద్దికి నోచుకోని పంచాయతీలలో అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దాలనే సంక్పంతో పల్లె ప్రగతి కి శ్రీకారంచుట్టి అన్ని హంగులతో,ఇంటింటికీ త్రాగునీరు,రోడ్లు,రహదారుల వెంట పచ్చదనం,పరిసరాలు పరిశుభ్రత,ఆరోగ్యం,విద్యా కనీస సౌకర్యాల కోసం స్థానిక వాస్తవాల మీద,ప్రజల ప్రాధాన్యత మీద ఆధారపడి అభివృద్దిని అంచనా వేయడం.నిర్వచించడం, అమలు పరచడం ప్రజలకు క్షేమదాయకంగా ఉండాలను కోవడం,ప్రజా అవసరాలకు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేసీఆర్‌ ఆలోచనల ప్రతిరూపం ‘‘పల్లే ప్రగతి పథకం’’ రాష్ట్రంలోని పంచాయతీలు పచ్చదనంతో,పరిశుభ్రతతో వెల్లివిరియాలని చేపట్టిన తలపెట్టిన పల్లే ప్రగతి కార్యక్రమం చిత్తశుద్దితో జరిపించాలని,అధికారులు,ప్రజా ప్రతినిధులు మోక్కుబడిగా,ఫోటోకు ఫోజులిచ్చి చేతులు దులుపుకుంటే,మనం చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తుంటారని,అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా తెలుసు కునేందుకు గ్రామాల్లో అకస్మిక పర్యటనలకు కూడా సిద్దం అని,హెచ్చరించిన తీరు అందరిని పరుగులు పెట్టించింది,గ్రామీణ జీవన విధానంలో వచ్చిన పెనుమార్పులకు దోహదం చేసింది.మన సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచింది.

ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించుకున్న పాఠశాలలు,అంగనివాడి కేంద్రాలు వినియోగంలేని ఎన్నో భవనాలు ఉపయోగంలోకి రావడం,ప్రతి గ్రామంలో పరిశుభ్రత కోసం పిచ్చి మొక్కులు తీసేసి,చెత్త,చెదారంతో నిండి ఉన్న డ్క్రెనేజీ కాల్వలు శుభ్రం చేయడం లాంటి పనులు తమ బాధ్యతలు గుర్తుంచుకునే విధంగా అందరు భాగస్వాములు అయ్యెందుకు,అలవర్చుకోవాలని,కాలుష్యంతో నిండి,పర్యావరణానికి దూరం అయిన ప్రకృతిని చక్కదిద్దిడం కోసం,ప్రతి గ్రామాన పచ్చటి చెట్లతో హరిత తెలంగాణగా రూపాంతరం చెందాలని,దాని కోసం అన్ని గ్రామాలలో నర్సరీ,వైకుంఠధామం,డంపు యార్డులకు ఏర్పాటు కోసం చాలా గ్రామాలలో స్థలాలు లేక పోవడం గుర్తించడం,స్థలాలు ఏర్పాటు చేయడం,శ్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమి,ఏశాఖ పరిధిలో ఉన్నా సరే గుర్తించి, దాన్నిసామాజిక అవసరాల కోసం వాడుకునే విధంగా చర్యలు తీసుకోవడం దశాబ్దాలుగా పేరుక పోయి ఉన్న సమస్యలను కేవలం 30 రోజులలో గుర్తించి, పల్లే ప్రగతి పథకం ద్వారా విజయవంతం చేసిన ఘనత,తెలంగాణ గాంధీ కేసీఆర్‌ ‌కు దక్కుతుందని మేధావులు అభినందిస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, వరంగల్‌ ‌జిల్లా,గంగదేవిపల్లి గ్రామంలో జరిగిన అభివృద్దిని ఆదర్శంగా తీసుకోని తెంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లే ప్రగతి పథకం ద్వారా రాష్ట్రంలోని మెజార్టీ పల్లెలన్నిప్రగతి వైపు పరుగులు తీస్తున్నాయి,గంగదేవిపల్లి1993 వరకూ గీసుకొండ మండలం లోని మత్సాపురం గ్రామా పంచాయతికీ ఆమ్లేట్‌ ‌గ్రామమే,1994లో గ్రామ పంచాయతిగా మారింది.మొదటి నుండి కూడా సర్పంచ్‌ ‌సహ మహిళలే గ్రామ సభలో సభ్యులుగా ఉండడం,అంకిత భావంతో,ఆదర్శ మైన లక్ష్యాలతో సేవ దృక్పథం ఉన్న వ్యక్తులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం,జాతిపిత బాపూజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ గాంధీ కేసీఆర్‌ ‌నిలువెత్తు నిదర్శనమే, గంగదేవిపల్లి గ్రామస్తులు ఐక్యతగా ఉద్యమించి, సంపూర్ణ మద్యపానం,గుట్కానిషేదం,1982 నుండి అమలు చేసి ఆదర్శంగా నిలిచి, స్వఛ్చందంగా మినరల్‌ ,‌ప్లోరైడ్‌ ‌రహిత వాటర్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేసి, 1రూపాయికే20 లీటర్ల తాగునీరు 346 కుటుంబాలకూ అందిస్తూ, 20సంవత్సారాల నుండి పచ్చదనం,పర్యావరణం,పరిశుభ్రత అమలును ఆదర్శ గ్రామంగా గుర్తించి2004 లోనే భారత రాష్ట్రపతి నుండి ఆవార్డు తీసుకున్న గంగదేవిపల్లి తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశానికి గర్వకారణం అని చెప్పక తప్పదు.కేసీఆర్‌ ఆలోచనల ప్రతిరూపం ప్రతి పల్లే ఆదర్శ గ్రామాలుగా వెలుగోంది దేశంలోనే తెలంగాణ అగ్ర బాగాన నిలిచిన ఫలితమే సజీవ సాక్ష్యం.

తెలంగాణ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పల్లే ప్రగతి పథకం.ఉపయోగపడే విధంగా కార్యచరణ చేసి,రాష్ట్రంలోని వెనుకబడిన మండలాల అభివృద్దికోసం సి యం,కేసీఆర్‌ ‌దర్శకత్వంలో చేపట్టిన పల్లే ప్రగతి పథకం ప్రతి సంవత్సరంలో మూడు సార్లు కాలానుగుణంగా సీజన్నుబట్టి ప్రత్యేక అవసరాలను బట్టి నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోని చక్కటి ప్రణాళిక రూపోందించు కోవాలని,అప్పుడే ప్రగతి సాధించవచ్చునని, 2019సెప్టెంబర్‌,6‌వతేదీ నుండి30రోజుల పాటు 5వ తేదీ అక్టోబర్‌ ‌వరకు ప్రతి జిల్లాలలో అట్టహాసంగా మొదటి విడుత రాష్ట్రం అంతట ప్రారంభం అయ్యింది.ప్రజా ప్రతినిధులు తమ నాయకత్వాన్ని ఋజువు చేసుకోవాడానికి సరైన వేదికగా గ్రామ వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్‌ ‌లు, సర్పంచ్‌ ‌లు, యంపిటీసీలు, జెడ్పిటీసిలు ఇట్టి అవకాశాన్ని సునాయాసంగా ,,భయపడకుండా విజయవంతం చేసినప్పుడే మన  ప్రతిభ,బయటకు వచ్చేందుకు,ఆదర్శంగా నిలిచేందుకు గోప్ప అదృష్టంగా భావించి, సి.యం,ఆదేశాల మేరకు పల్లే ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలని ఇచ్చిన పిలుపుతో గ్రామ,గ్రామాన ప్రగతి ఏజెండాలే లక్ష్యంగా  గ్రామసభలు ముందుకు సాగడం, తెలంగాణ ప్రగతికి..పట్టు కోమ్మలు గ్రామ పంచాయతీలు అనే విషయం ఎవరు విస్మరించలేరు. ఇప్పుడు ఉన్న 80% శాతం నాయకులు ప్రస్తుత శాసన సభ్యులు,పార్లమెంటు సభ్యులు గ్రామసభ నుండి వచ్చిన వారే అనేది జగమెరిగిన నగ్నసత్యం. భవష్యత్తు లో కూడా పటిష్టమైన నాయకత్వం గ్రామాల నుండే వన్తుందనేది యధార్థం.

తెలంగాణ ప్రగతికోసం ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి బంగారు తెలంగాణ దిశగా పయనించడానికి,పల్లె ప్రగతి పథకం గ్రామ అభివృద్దిలో కీలక భూమిక పోషిస్తుందనడంలో ఏలాటి అతిశయోక్తిలేదు. ప్రతి గ్రామంలోపవర్‌ ‌వీక్‌ ‌నిర్వహించాలని భావించి వైర్లు లాగి,కరెంట్‌ ‌స్థంభాలను సవరించడం గాలి, దూమారం తో విధ్యుత్త్ ‌స్తంభాలు కూలి మృత్యువాత పడ్డ సంఘటనలతో రైతుకు హని జరుగకుండా చేయడం,గ్రామాల లోని వీధి ల్కెట్ల నిర్వహణలో 6834 కిలోమీటర్ల మేరకు కొత్త వైర్లు వేసి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌లో ఏర్పాటు చేసిన ఎల్‌ఇడీ బల్బులతో సాదించిన పలితాలను, దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామ పంచాయతీలకు వీధి ల్కెట్ల కరెంటు బిల్లు భారం కాకుండా ఎల్‌ఇడి,బల్బులు వినియోగించి రెవెన్యూ ఆదా చేయాలని చేసిన ప్రయత్నం తో పల్లెలకు పట్టణ కల వచ్చింది.విధ్యుత్త్ ‌శాఖ,పవర్‌ ‌వీక్‌ ‌కార్యక్రమంలో తుప్పు పట్టిన ,వంగిన స్థంబాలను గుర్తించి,వాటి స్థానంలో కొత్త స్థంబాలు ఏర్పాటు చేసుకోవడం,వైర్లు నేలకు వేలాడకుండా సరిచేసి ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా చూసి,నడువని మీటర్ల స్థానంలో కోత్తగా 254424 ఏర్పాటు చేయడం,ఎన్నో మౌలిక సదపాయాలు కల్పించి ,24 గంటల కరెంట్‌ ‌సౌకర్యం కల్పించి, ప్రజల భాగస్వామ్యంతోనే ,అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ది లక్ష్యంగా గ్రామాలకు మహర్ధశ తీసుకోచ్చిన  తెలంగాణ గాంధీ అని ప్రజలు కేసీఆర్‌ ‌ను ప్రశంసిస్తున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏ రాష్ట్రంలో లేని సంస్కరణలు తెలంగాణ రాష్ట్రలో అమలు చేసినారని,పల్లె ప్రగతి ద్వారా33జిల్లాలలోని141మున్సిపాల్టీలలో12751గ్రామ పంచాయతీలలో ప్రధానంగా డ్క్రెనేజి,దోమల నివారణ,పరిశుభ్ర,పచ్చదనం కోసం గ్రామాలలో10%శాతం నిధులు కేటాయించారు. గ్రామాభివృద్ది కోసం పరితపించే మహనాయకుడు,కేసీఆర్‌,ఉద్యమ నేతగానే కాదు,పరిపాలనలో దిట్ట, ఒక ప్రత్యేకత,ఏ పని చేపట్టిన ఒక విజన్‌ ‌తో ముందుకు వెళ్ళడం అనేది నాయకునికి వెన్నతో పెట్టిన విద్య,అందుకే కేసీఆర్‌ అపజయాలను,అవహేళననుఎప్పుడూ లెక్క చేయలేదు,విజయం సాధించే వరకు నిద్రపోడు,అదే ఆయన పట్టుదల.. గ్రామ పంచాయతీలలో ప్రగతి సాధించడం తన కర్తవ్యంగా ముందుకు సాగడం అనిర్వచనీయం. గ్రామాలలో అభివృద్ది కోసం పుడమి తల్లికి పచ్చలహారం,పరిశుభ్రత,స్మశానవాటిక,డంపుయార్డు,నర్సరీ ఏర్పాటు కోసం స్థలాల గుర్తింపు .గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు,వాటర్‌ ‌టాంకర్‌,‌చెత్త సేకరణకోసం (ట్రాలి,హొక్లీన్‌ ‌చేయడానికి,ముందు భాగంలో బ్లేడు) నిధులు అందచేసి నాటిన మొక్కలకు,చెట్లకు ట్రీగార్డు,పశువులు మేయకుండా కంచే ఏర్పాటుచేసి,పల్లే కలలు సాకారం చేసిన కేసీఆర్‌ ‌గూడు ప్రజల గుండెల్లోఎప్పుడు పదిలమే.

రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకంతో30రోజుల్లో చేపట్టే పచ్చదనం,పరిశుభ్రత,విధ్యుత్త్,‌మౌలిక అంశాలతో కూడిన వివిధ కార్యక్రమాల కోసం గ్రామ రెవెన్యూకు అదనంగా ప్రతి నెల339కోట్లు కేటాయించి,మండల స్థాయిలో మండల అధికారి,గ్రామ స్థాయిలో ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో ప్రజలను చ్కెతన్యం చేసేందుకు విసృత ప్రచారం చేసి గ్రామసభలు నిర్వహించి,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు కోరుకుంటున్న ప్రగతి ఏవిధంగా ఉండాలో వారి సందేశంలో తెలియ జేయడం గాను గ్రామ ప్రజలు అందరు సమూహంగా ఏర్పడి వారికి కావల్సిన పనుల గురించి గ్రీవేన్సు సెల్‌ ‌ద్వారా గ్రామ సభలో చర్చించే విధంగా అభివృద్దిలో భాగస్వాములు కావాడానికి,కోరం కోసం,కోఆప్షన్‌ ‌సభ్యులను,స్టాండింగ్‌ ‌కమిటీ సభ్యులను ఎంపిక చేసుకొని,ఆయా కమిటీలలో మహిళలకు 50%శాతంకు తగ్గకుండా ప్రాధాన్యత ఇచ్చి,సర్పంచ్‌,‌ప్రత్యేక అధికారి,గ్రామ కార్యదర్శి,సభ్యులతో కల్సి పాదయాత్ర,పనుల విభజనతో కార్యచరణ చేపట్టి,గ్రామంలో పేరుక పోయిన సమస్యలు పరిష్కరించుకున్నాక అభివృద్దిని చూస్తూ,భవిష్యత్త్ ‌కాలంలో మేము అభివృద్ది చేసిన పల్లెను,మేజర్‌ ‌పంచాయతీలుగా,మేజర్‌ ‌పంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడంలో కేసీఆర్‌ ‌చేపట్టిన పల్లె ప్రగతి దోహద పడింది.

పల్లె ప్రగతిలో పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావడం పండుగ శోభను తలపించింది. ఫ్రెండ్లీ వాతావరణం కల్పించింది. జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి 2కోట్ల నుండి 5కోట్ల రూపాయల వరకు అభివృద్ది కోసం కేటాయిస్తామని ప్రకటించిన సంగతి విదితమే, గ్రామ పంచాయతీలో మౌళిక సదుపాయాల రూపకల్పన కోసం పల్లే ప్రగతి పథకం అమలుకోసం,మండలానికి ఒక అధికారి, గ్రామ, గ్రామాన వారోత్సవాల పేరిట సిబ్బందిని నియమించి, గంగదేవిపల్లి, అంకాపూర్‌ ‌గ్రామాలను ఆదర్శంగా తీసుకున్నట్లయితే ప్రతి గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని నాడు మహాత్మగాంధీ దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తే, నేడు తెలంగాణ రాష్ట్రం కోసం అహింస మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన అద్వితీయుడు నేటి గాంధీ కేసీఆర్‌..‌గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ పల్లెల్లో నిర్మించి,అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదాల్చిన తెలంగాణ గాంధీ కేసీఆర్‌ ‌వేస్తున్న ప్రతి అడుగు బంగారు తెలంగాణ దిశగా ప్రగతిపథంలో నడుస్తుండడం ముదావహం..
(17పిబ్రవరి,తెలంగాణ ప్రధాత కేసీఆర్‌ ‌పుట్టినరోజు సందర్బంగా)

sangam
డా. సంగని మల్లేశ్వర్‌,
‌జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,
‌సెల్‌ .986625535

Leave a Reply