Take a fresh look at your lifestyle.

వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి

  • లేకుంటే మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం
  • పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరిక
  • ధాన్యం సేకరణపై డ్రామాలు ఆపి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి : షబ్బీర్‌ అలీ
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి : ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి
  • రైతులను ఇబ్బంది పెడితే..చంద్రబాబుకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుంది : ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి
  • అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ‌ధర్నా : కెసిఆర్‌ ఇచ్చిన హావి•లు ఏమయ్యాయని ప్రశ్న

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రభుతం ఒక నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు  రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…24 గంటలలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలును ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని రైతులకు భరోస కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టీఆర్‌ఎస్‌ ‌నేతలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు  చేపట్టాలన్నారు.

రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్‌ ‌రైతుల పక్షాన పోరాటం చేస్తూ వారికి అండగా ఉంటుందని రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

ధాన్యం సేకరణపై డ్రామాలు ఆపి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి : షబ్బీర్‌ అలీ
ధాన్యం సేకరణలో అధికార టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు డ్రామాలు ఆపి రైతులను ఆదుకోవాలని, పండిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ ‌చేశారు. ఈ రెండుపార్టీలు పోటాపోటీగా ధర్నాలుచేసి సాధించిందేమిటనిఆయన ప్రశ్నించారు.

ధాన్యం సేకరణ సమస్యలను పరిష్కరించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టీఆర్‌ఎస్‌ ‌నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలన్న ఆయన రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న హావిని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి : ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని..రైతులకు భరోసా కల్పించాలన్నారు. ధాన్యం సేకరణ ప్రభుత్వ బాధ్యతని అన్నారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుందని, వారికి అన్యాయం జరిగితే వారి పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే..చంద్రబాబుకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుంది : ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి
వరి ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ… ఢిల్లీలో కేసీఆర్‌ ‌దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదని..చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు. వారు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరని…తాము నిరసనలు చేస్తే అరెస్ట్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు.

దేవుని దయ వల్ల వర్షాలు బాగా పడి గ్రౌండ్‌ ‌వాటర్‌ ‌పెరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్‌ ‌వాటర్‌ ‌పెరిగిందని టీఆర్‌ఎస్‌ ‌నేతలు గొప్పలు చెప్పుకుంటుంన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకుంటుంన్నారని.. ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని కోమిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ‌ధర్నా : కెసిఆర్‌ ఇచ్చిన హావి•లు ఏమయ్యాయని ప్రశ్న
సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఎంత వరి పంట అయినా కొంటా అని గతంలో మాట్లాడారని కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ ‌మధుయాష్కీ పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌సొంత జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ‌మాటలు నమ్మి మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ రైతాంగం కాంగ్రెస్‌ ‌పార్టీతో కదిలి రావాలని మధుయాష్కీ తెలిపారు. అధికార పార్టీతో యుద్ధం చేసి చివరి గింజ వరకూ కొనేలా చేస్తామని మధుయాష్కీ పేర్కొన్నారు. రైస్‌ ‌మిల్లర్లతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కయ్యారన్నారు.

అధికార పార్టీ నేతలను ఊర్లలో తిరగనీయకుండా రైతులు అడ్డుకోవాలన్నారు. పంట కొనుగోలు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని మధుయాష్కీ పేర్కొన్నారు.  ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌నేతలు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌ ‌నేత  రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ట్యాంక్‌ ‌బండ్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ‌చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజని కేసీఆర్‌ ‌కొనాలని డిమాండ్‌ ‌చేశారు.టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వెంటనే విద్యుత్‌ ‌చార్జీలు తగ్గించాలని  రోహిత్‌రెడ్డి కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదని మహిళా కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు అన్నారు. మంగళవారం నగరంలోని ట్యాంక్‌ ‌బండ్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ‌చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సునీత రావు వి•డియాతో మాట్లాడుతూ.. కరెంట్‌ ‌చార్జీలు తగ్గించకపోతే మరోసారి విద్యుత్‌ ‌సౌధకి పోదామని చెప్పారు. ఈ కేబినెట్‌ ‌సమావేశంలో పెంచిన ధరలు, ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకోవాలని సునీత రావు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply