Take a fresh look at your lifestyle.

కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన గ్రేస్‌ ‌హోం నిర్వాహకులు

పట్టణాల నుండి పల్లెల కు పాకిన కరోనా, గ్రామాల ప్రశాంతతను చెదరగొడుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ పంచాయితీ పరిదిలోని లక్ష్మిపురం గిరిజన గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకింది. ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సం•ంధాలు తెగి పోయాయి. గ్రామంలోకి సమీప గ్రామాల వారు ఎవరూ రావడం లేదన్నారు. ఈ గ్రామస్తులను ఇతర గ్రామాలకు రానీయడం లేదు. బుధవారం గ్రేస్‌ ‌హోం అనాధాశ్రమం  నిర్వాహకులు, గ్రామ యువజన సంఘం అధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించి నిత్యావసర సరకులు పంపణి చేశారు.

గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులకు కరోనా సోకి  గ్రామానికి ఎవరూ రావడం లేదని గ్రామస్థుల బాగోగులు ఎవరూ పట్టించు కోలేదని,  గ్రామంలోనే స్థానికంగా దొరికే ఆహారాలతో జీవనం గడుపుతున్నారని తెలిసి గ్రామాన్ని సందర్శించామని గ్రేస్‌ ‌హోం నిర్వాహకురాలు కారం రాధ తెలిపారు. పాత్రాపురం యువజన సంఘంసభ్యులు పలువురు గ్రామంలో కోవిడ్‌ ‌పేషెంట్లకు బియ్యం, పప్పులు, పండ్లు కూరగాయలు పంపణి చేశారు. ఈసందర్బంగా గ్రేసే హోం నిర్వాహకురాలు మాట్లాడుతూ తమ వృద్ధాశ్రమం కోసం కొత్తగూడెం జిల్లా చంద్రుగొండకు చెందిన బిల్డర్‌ ‌తిరుపతిరావు ఫేస్‌ ‌బుక్‌లో రిక్వెస్ట్ ‌చూసి రూ.5వేల ఆర్థిక సహాయం చేశాడన్నారు. ఆ డబ్బులతో కొండజాతి గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు వాసం సరోజిని, కారం రాజు, వాసం సమ్మయ్య, వెంకట్‌, ‌చందు నవీన్‌, ‌సంతోష్‌ ‌రాజు,రామకృష్ణలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply