మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
గిరిజనులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోమారు హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ స్పూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు. మూడెకరాల భూమి, 10శాతం రిజర్వేషన్ హామిని నిలబెట్టుకోలేని.. సీఎం కేసీఆర్.. గిరిజనుల భూములు గుంజు కుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
గుర్రంపోడు తండాలో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. సేవా లాల్ జయంతి కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజన మహిళలు నృత్యాలు చేశారు. సేవ లాల్ జయంతి సందర్భంగా సేవాలాల్ చిత్ర పటానికి బండి సంజయ్ నివాళులు అర్పించారు. బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హుసేన్ నాయక్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.