Take a fresh look at your lifestyle.

కొరోనా కార్పొరేట్‌ ‌దందాపై కేంద్రం సీరియస్‌

3 ‌ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌పై విచారణకు ఆదేశం

‌రాష్ట్రంలో కొరోనా చికిత్సల పేరుతో ప్రైవేటు దవాఖానాల దందాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసిన 3 కార్పొరేట్‌ ‌దవాఖానాలపై విచారణకు ఆదేశించింది. తెలంగాణలో కొరోనా రోగుల నుంచి వైద్య చికిత్సల కోసం అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారనీ, చివరికి అడిగినంత ఇవ్వందే మృతదేహాలను సైతం అప్పగించడం లేదని నేషనల్‌ ‌ఫార్యాస్యుటికల్‌ ‌ప్రైసింగ్‌ అథారిటీ ఆప్‌ ఇం‌డియాకు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌కు చెందిన సామాజిక వేత్త విజయ్‌, ‌తెలంగాణ ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌ప్రజల సమస్యల పరిష్కారాల అసోసియేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌ ఈ ‌దవాఖానాల నిర్వాకంపై ఆధారాలతో కూడిన పిర్యాదులు అందజేశారు.

దీనిపై స్పందించిన అధారిటీ హైదరాబాద్‌లోని 3 కార్పొరేట్‌ ‌దవాఖానాలపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో యశోద, కేర్‌, ‌మెడిక్యూర్‌ ‌హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ మూడు హాస్పిటల్స్ ‌కొరోనాకు వైద్యచికిత్సల కోసం చేరిన బాధితులకు ఇన్సూరెన్స్ ‌సదుపాయం ఉన్నప్పటికీ వాటిని అంగీకరించకుండా ముందుగా డబ్బులు చెల్లిస్తేనే చికిత్సలు అందజేస్తామని షరతులు విధించాయని కేంద్రానికి ఇచ్చిన విజయ్‌ ‌ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొరోనా చికిత్సలు, బాధితుల నుంచి వసూలు చేయాల్సిన ఫీజుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ఆయా హాస్పిటల్స్ ‌యాజమాన్యాలు పట్టించుకోలేదని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply