Take a fresh look at your lifestyle.

విత్తనాల విక్రయంలో సర్కారు నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వరి, మొక్క జొన్న విత్తనాలు క్రయ విక్రయాల చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు విత్తన డీలర్లను హెచ్చరిం చారు. మంగళవారం అర్బన్‌ ‌కలక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో విత్తన కంపెనీ ప్రతినిధులు డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పంట ల నియంత్రణ పద్ధతుల విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో జొన్న విత్తనాలను అసలుకే క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేదని డీలర్లను కోరారు. వరి పంట వేసేందుకు ఏ యే జిల్లాకు ఏ ఏ వెరైటీ ఎంత విస్తీర్ణంలో వేయాలో నిర్ణయించి లక్ష్యాన్ని కేటాయిస్తుందని, కేటాయింపు చేసిన తర్వాత ఏ ఏ ఏరియాలో యే యే రకాలు ఎంత విస్తీర్ణంలో వేయాలో జిల్లాలో నిర్ణయించి డీలర్లకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు వరి విత్తనా లను క్రయ విక్రయాలు జరపవద్దన్నారు. మొక్క జొన్న వేసిన రైతుకు రైతు బంధు పథకం వర్తింప జేయడం జరగదని ముఖ్యమంత్రి సోమవారం స్పష్టంగా తెలియ జేసినందున ఏ రైతు కూడా మొక్కజొన్న విత్తనాల కోసం వచ్చిన పక్షంలో పూర్తి అవగాహన కల్పించి ఎంత ఒత్తిడికి గురైన విక్రయాలు జర్పవద్దని పేర్కొన్నారు. ఇప్పటికే మొక్కజొన్న, వరి విత్తనాలను తెచ్చుకొని సిద్దంగా ఉన్న నేపథ్యంలో మాకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఈ విషయంలో మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని కలెక్టర్‌ను కోరారు.

అట్టి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని కలక్టర్‌ ‌వివరించారు. రెండు లేదా మూడు రోజుల్లో ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని అప్పటి వరకు వరి, మొక్కజొన్న విత్తనాలు విక్రహించవద్దన్నారు. ఈ విషయంలో రైతులు కూడా ఎలాంటి తొందరపడకుండా వరి విత్తనాలు కొనుగోలు చేయవద్దని కోరారు. మొక్కజొన్నకు బదులు కందులు, ఇతర పంటలు వేసుకోవాలని, పండించిన కంది పంటను ప్రభుత్వమే గ్యారంటీగా ఎంత పంటనైన మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రకటించారని కలెక్టర్‌ ‌వివరించారు. మొక్కజొన్న వర్షకాలం బదులు యాసంగి పంటలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా విత్తుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జెడిఎ ఉషా దయాళ్‌, ‌డిడి దామోదర్‌ ‌రెడ్డి, డిఏం సీడ్‌ ‌రఘు, విత్తన కంపెనీ ప్రతినిధులు డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!