Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమానికి సర్కార్‌ ‌మరో కీలక నిర్ణయం

  • బీమా పథకానికి సిఎం జగన్‌ శ్రీ‌కారం
  • రైతుల ప్రీమియం వాటాను కూడా ప్రభుత్వమే కట్టేలా చర్యలు
  • బీమా చెల్లింపుతో 5.94 లక్షల మంది రైతులకు లబ్ది

అమరావతి,జూన్‌ 26 : ‌రైతులకు బీమా ప్రీమియాన్ని సీఎం జగన్‌ ‌విడుదల చేశారు. బీమా ప్రీమియం కింద రూ.596.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బీమా చెల్లింపుతో 5.94 లక్షల మంది రైతులకు లబ్దిచేకూరునుంది. రైతు ఖాతాల్లో నేరుగా బీమా ప్రీమియం జమ కానుంది. 2019-20 నుంచి రైతులకు ఉచితంగా వైఎస్‌ఆర్‌ ‌రైతు బీమా అమలవుతోంది. బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని సీఎం జగన్‌ ‌ప్రకటించారు. రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. క్యంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీమాపై జగన్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రైతులకు ఉచితంగా పంటల బీమా అందిస్తామని సీఎం జగన్‌ ‌ప్రకటించారు. రైతులకు బీమా అందించేందుకు బీమా సంస్థలతో ప్రభుత్వం చర్చించినట్లు వెల్లడించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు బీమా పక్రియలో మార్పులు చేసినట్లు వివరించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ-క్రాపింగ్‌ ‌నమోదు చేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్దే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. రైతులు వేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తా మన్నారు.నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారుతమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించేందుకు..రూ. 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. తద్వారా 5,94,005 మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ.. 2019-2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ ‌పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని పునురుద్ఘా టించారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

రైతు భరోసా కేంద్రంలోనే ఇ- క్రాపింగ్‌ ‌నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్‌, ‌రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ ‌కలిసి ఇ- క్రాపింగ్‌ ‌రిజిస్టర్‌ ‌చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు రూపాయి కడితే చాలు.. వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాగా పంటల బీమాను ఇ-క్రాప్‌తో అనుసంధానించడం ద్వారా ఖరీఫ్‌ 2019‌లో 25.73లక్షలు.. 2019?20 రబీలో 33.03 లక్షల మందికి మొత్తంగా 58.76లక్షలమందికి ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందనుంది. గత ప్రభుత్వ హయాంలో బీమా పరిస్థితి ఎలా ఉండేదో..ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా తెలు స్తోంది.రైతులు ప్రీమియం చెల్లించిన తర్వాత,మిగిలిన వాటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం చెల్లించాలి. సీజన్‌ ‌ప్రారంభం కాగానే ప్రీమియం చెల్లింపు జరగాలి. అప్పుడే రైతుకు పరిహారం సక్రమంగా అందుతుంది. అయితే గత ప్రభుత్వం బీమా చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ ‌ప్రీమియం రాని పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సిఎం జగన్‌ ‌వివరించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక బీమా కంపెనీలతో చర్చలు జరిపి, ప్రీమియంను చెల్లించి,దాదాపు 5.95 లక్షల మంది రైతులకు బీమా చెల్లించడం జరుగుతోందన్నారు.గత ప్రభుత్వం హయాంలో మాదిరి రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని సమూలంగా మార్పులు తీసుకువచ్చాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దేవుడి దయ, అందరి ఆశీస్సులు కారణంగా ఇదంతా చేయగలుగుతున్నాం. ఈ డబ్బును పాత అప్పులకు జమచేసుకోకుండా అన్‌ ఇన్‌కంబర్డ్ ‌ఖాతాల్లో ఈ బీమా డబ్బును జమ చేస్తున్నాం అని సీఎం జగన్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రైతుల కోసం చేస్తున్న కృషికి సిఎం జగన్‌ ‌రైతుబాంధవుడిగా నిలిచిపోతారని అన్నారు. అనేక కార్యక్రమాలతో ఇప్పటికే రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ దశలో బీమా సౌకర్యం వారికి ధైర్యం నింపసనుందన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!