Take a fresh look at your lifestyle.

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  • విద్య, వైద్యం, విద్యుత్‌, ‌సాగునీటిరంగాల్లో అసాధారణ విజయాలు
  • 16246 మెగావాట్లకు పెరిగిన
  • స్థాపిత విద్యుత్‌ ‌సామర్థ్యం
  • యాసంగి సాగులో 123 శాతం వృద్ధి  
  • ఐటి ప్రగతితో ఆర్థిక వృద్ధిరేటు
  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ప్రొఫైల్‌
  •  ‌రైతుబంధు సమితుల కార్యాచరణ
  • రైతుబంధు ప్రపంచానికే ఆదర్శం
  • అసెంబ్లీలో గవర్నర్‌ ‌తమిళిసై ప్రసంగం

తెలంగాణ రాష్ట్రం ఆరేళ్లకాలంలో అనేకరంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌స్షష్టం చేశారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందువరుసలో నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఉద్యమనేత ప్రభుత్వాధినేతకావడం తెలంగాణకు వరప్రసాదమైందని ఆమె వ్యాఖ్యానించారు. పేదప్రజలందరికీ అభివృద్ధిఫలాలు దక్కాలనే లక్ష్యంతో,జీవనభద్రత కల్పించాలనే బాధ్యతతో సంక్షేమం అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. గురువారం రాష్ట్ర గవర్నర్‌ ‌శాసనమండలి, శాసనసభల నుద్ధేశించి ప్రసంగించారు. 40 నిముషాల సేపు మాట్లాడిన గవర్నర్‌ ‌రాష్ట్రం అనేక రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ ఇం‌గ్లీషులో ధారాళంగా తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని విశదీకరించారు.

రాష్ట్రం సాధించిన నాటి పరిస్థితులను, ఇప్పుడు సాధిస్తున్న పురోగతిని చూసి అఖండభారతం అబ్బురపడుతున్నదని గవర్నర్‌ ‌వ్యాఖ్యానించారు.2014 జూన్‌2 ‌తెలంగాణ ఆవిర్బవించిన కాలంలో అన్నీ రంగాల్లో దుర్బర పరిస్థితులు ఉండేవని, విద్యుత్‌కోతలతో రాష్ట్రం గాఢాంధకారంలో ఉండేదని, పేదప్రజలకు జీవనభద్రత ఉండేది కాదని అన్నారు.వ్యవసాయ రంగం కుదేలైపోయిందనివేలాది, అన్నదాతల ఆత్మహత్యతలతో, పేదప్రజల నిరాశానిస్పృహలతో తెలంగాణ తల్ల డిల్లిపోయిందని నాటి పరిస్థితులను జ్ఞాపకం చేశారు.రైతులు అధికవడ్డీ చెల్లించి పెట్టుబడిని సమకూర్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉండేవని చెప్పారు.చెరువులు విధ్వంసమ య్యాయని, భూగర్భజలాల మట్టం పడిపోయిందని, ఎనిమిదివందల అడుగుల లోతుకు పోయినా , నీళ్లులభించని పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు.కులవృత్తులు కూలిపోయి, వ్యవసాయం కుదేలై ప్రజల వలస బతుకులు బతికిన కాలం కళ్లముందు కదలాడుతున్నదని అన్నారు.

తెలంగాణ సంస్పృతిపండుగల మీద దాడి జరిగిందని, దేవాలయాలకు ప్రాధాన్యత ఉండేది కాదని అన్నారు. ఈ దురవస్థలన్నింటినీ అధిగమించాలనే సంకల్పంతో 2014జూన్‌2‌న ఉద్య మ నాయకుడు కేసీఆర్‌ ‌సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్ర పునర్నిర్మాణ యజ్నాన్ని ప్రారంభించిందని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో 60వేల నుంచి లక్షన్నరకు, పట్టఠణ ప్రాంతాల్లో 75 వేల నుంచి రెండులక్షలకు పెంచామని చెప్పారు. ఆసరా పెన్షన్‌ను రూ.2016లకు పెంచడంతో పేదలు ఎవరిమీద ఆధారపడకుండా సంతోషంగా బతుకుతున్నారని అన్నారు.వికలాంగుల పెన్షన్‌ ‌రూ.500 నుంచి రూ.3016లకు పెంచామని, లక్షలాది బీడికార్మికులకు రూ.2016లు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.వృద్ధాప్య పింఛన్‌ ‌వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించామని, తద్వారా 57 సంవత్సరాలు నిండినవారందరికీ పెన్షన్‌ ‌సౌకర్యం లభిస్తుందని గవర్నర్‌ ‌తెలిపారు.

దేశంలో ఎక్కడాలేనివిధంగా పేద విద్యార్థులకోసం 959 గురుకుల పాఠశాలలు స్థాపించి అత్యున్నత ప్రమాణాలతో విద్యను ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో సుఖప్రసవాలను ప్రోత్సహించాలనే ఆలోచనతో కేసీఆర్‌కిట్స్ ‌పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యన్నతికోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఖర్ఛు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారం ఇచ్చామని, ప్రతీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాల లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరించి రెగ్యులరైజైషన్‌ ‌కూడా తన ప్రభుత్వం చేస్తున్నదని ఆమె తెలిపారు.లాయర్లు, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రథ్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందని చెప్పారు.పేదబ్రాహ్మణుల సంక్షేమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ‌ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దేవాలయాల అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు.మసీదుల్లో ప్రార్ధనలు చేసే ఇమామ్‌చ మౌజమ్‌లకు నెలకు రూ.5వేలు చొప్పున భృతిని అందిస్తున్నామని వెల్లడించారు.

వేతనాలు పెంచిన ప్రభుత్వం:
హోంగార్డులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు వర్కర్లు, ఆశావర్కర్లు, ఐకేపీ, సెర్ఫ్, ‌నరేగా ఉద్యోగులు, 108, 104 సిబ్బంది, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ• ఉద్యోగులు, వీఆర్‌ఏ, ‌విఏఓలు, కాంట్రాక్ట్ ‌లెక్చరరలు, సీఆర్టీలు, అర్చకులు తదితర ఉద్యోగులందరికీ వేతనాలను పెంచామని తెలిపారు.పోలీస్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేశామని చెప్పారు.ట్రాఫిక్‌ ‌పోలీసులకు 30శాతం అదనపు రిస్క్ అలవెన్సు అందిస్తున్నామని వివరించారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28శాతాన్ని బోనస్‌ అం‌దిస్తున్నామని తెలిపారు.

విద్యుత్‌ ‌విజయాలు:
విద్యుత్తు రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనతికాలంలోనే అద్భుత విజయాలను సాధించిందని గవర్నర్‌ ‌వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే తలసరి విద్యుత్‌ ‌వినియోగం అధికంగా ఉన్నదని ఉమ్మడి జిల్లాలనాటి వినయోగానికిమించి అత్యధికంగా 13,168 మెగావాట్ల విద్యుత్‌డిమాండ్‌ ‌వచ్చిందని చెప్పారు.24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించగలుగుతున్నామని చెప్పారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థక్యం కలిగిఉండగా, నేడు రాష్ట్రానికి 16,246 స్థాపిత విద్యుత్తు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగాభివృద్ధి:
రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వం సకాలంలో అందిస్తున్నదని పేర్కొన్నారు.కల్లీ ఎరువులు, కల్తీవిత్తనాలఅంటగట్టేవారిపై పీడీచట్టం కింద చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వ సమ ్రజలవిధానాన్ని రూపొందించుకొని అమలు చేస్తున్నామని చెప్పారు. పెండింగ్‌ప్ ‌ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం ద్వారా 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నామని చెప్పారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించడం వల్ల భూగర్భ జలమట్టం పెరిగిందని అన్నారు. ప్రపంచంలోనే బహుళ ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌దశలవార్గీగా పూర్తవుతున్నదని చెప్పారు.గోదావరి ద్వారా రోజు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నామని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ‌పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలో యాసంగి పంటసమయంలో నీటిపారుదల రంగంలో సాధించిన ప్రగతివల్ల ఈసారి వరిసాగు 38,19,419ఎకరాలకు చేరుకున్నదని ,యాసంగి సమయంలో 123.5 శాతం వరివిస్తీర్ణం పెరిగిందని గవర్నర్‌ ‌స్పష్టం చేశారు.

రైతుబంధు ప్రపంచానికే ఆదర్శం:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన రైతుబంధు పథకానికి ప్రపంచమంతటా ఆదరణ లభిస్తున్నదని ఆమో వివరించారు.వ్యవసాయాభివృద్ధికోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐక్యరాజ్యపమితి ప్రకటించిందని చెప్పారు.రైతు సమన్వయ సమితులను రైతుబంధుసమితులుగా మార్చామని చెప్పారు.రైతాంగాన్ని సమన్వయ సంఘటితశక్తిగా తీర్చిదిద్దేందుకు రైతుబంధుసమితులు పనిచేస్తామని వివరించారు.్ప ప్రభుత్వం త్వరలోనే రైతుబంధు కార్యాచరణసమితి కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు.

వైద్య ఆరోగ్యం:
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక్క ప్రైమరీ హెల్త్ ‌సెంటర్‌కు కూడా నేషనల్‌ ‌క్వాలిటీ అక్రిడేషన్‌స్టాండర్డ్(ఎన్‌సీఏఎస్‌) ‌రాలేదని తెలంగాణ వచ్చాక ఆరేళ్లలో 84పీహెచ్‌సీలు ఎన్‌సీఏహెచ్‌లు సాధించాయని చెప్పారు. న్యూబార్‌ ‌కేర్‌సెంటర్లను 22 నుంచి 42వరకు పెంచామని, మెడికల్‌కాలేజీలను 4 నుంచి 9కి పెంచామని చెప్పారు.కంటివెలుగు పేరుతో భారీ స్థాయిలో ఐస్క్రీనింగ్‌ ‌నిర్వహించి కోటి లక్షల మందికి కంటి పరీక్షలు చేసి 41లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశామని గవర్నర్‌ ‌తమ ప్రభుత్వ ఘనతలను చాటి చెప్పారు.త్వరలోనే తెలంగాణ హెల్త్‌ప్రొఫైల్‌ ‌కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.హైదరాబాద్‌లో 350 బస్తీదవాఖానాలును ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

ఎవరి ఊరును వారు బాగు చేసుకోవాలి:
ఎవరి ఊరును వారు బాగు చేసుకోవాలనే స్పూర్తిని గ్రామాలలో పెంపొందించడంకోసం కొత్తగ్రామీణ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని చెప్పారు.3146 ఎస్టీ ప్రాంతాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో గ్రామపంచాయతీల సంఖ్య 12751 లకు పెరిగిందని,గ్రామాల అభివృద్ధికోసం కొత్త పంచాయతీరాజ్‌ ‌చట్టం, మున్సిపాలిటీల అభివృద్ధికోసం కొత్త మున్సిపల్‌ ‌చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధికి ప్రతీనెల రూ.339కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.
ఐటీరంగంలో తెలంగాణ బలమైన శక్తిగా ఎదిగిందని, పేరుపొందిన ఐటీ సంస్థలన్నీ తెలంగాణలో శాఖలను ప్రారంభించాయని గవర్నర్‌ ఉదహరించారు.ఐటీ ఎగుమతులు ఒకలక్షా 9వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.తెలంగాణ వృద్ధిరేటు 16.89శాతం కావడం ఐటీరంగంలో సాధించిన ప్రగతికి నిదర్శనమని అన్నారుదేశవ్యాప్తంగా క్లిష్టపరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోగలుతున్నామని అన్నారు. ఆకలి దప్పులు లేని,అనారోగ్యాలులేని, శతృత్వంలేని రాజ్యమే గొప్ప రాజ్యమనే సూక్తితో ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

Tags: Extraordinary achievements in education, medicine, electricity and aviation, Governor Tamilisai, Speech, Telangana Assembly

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!