Take a fresh look at your lifestyle.

విశ్వవిద్యాలయాలకు విసిలను నియమించండి ప్రభుత్వానికి గవర్నర్‌ ‌లేఖ

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాయాలకు వెంటనే వైస్‌ ‌చాన్స్‌లర్‌లను నియమించాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాన్‌ ‌ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. వీరి నియామకానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌కు రాసిన లేఖలో సూచించినట్లు తెలుస్తోంది. 2019 నాటికే రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, జేఎన్‌టియూ, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్‌ ఓపెన్‌ ‌వర్సిటీ వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. అప్పటి నుంచి ఈ విశ్వవిద్యాలయాలన్నీ ఇన్‌చార్జిల పాలనలో నడుస్తున్నాయి.

అదే ఏడాది వీసీల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేయగా, 984 దరఖాస్తులు వచ్చాయి. గవర్నర్‌ ‌తమిళిసై ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 11 వర్సిటీలకు విసిల పదవీ కాలం పూర్తయి దాదాపు ఏడాదిన్నర అయినప్పటికీ పూర్తి స్థాయి విసిల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం పట్ల గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ ‌కమిటీల సమావేశాలు త్వరగా నియమించాలనీ, వీసీల నియామకాల పక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని గవర్నర్‌ ‌తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

Leave a Reply