Take a fresh look at your lifestyle.

పివి భారతజాతి ముద్దుబిడ్డ…పేద ప్రజల పెన్నిధి

పివిపై ప్రచురించిన పుస్తకాలు ఆవిష్కరించిన గవర్నర్‌
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారత ముద్దుబిడ్డ అని శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌ప్రస్తుతించారు. పివి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ప్రధానిగా దక్షిణాది నుంచి వొచ్చిన ఏకైక వ్యక్తి అన్నారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో గవర్నర్‌ ‌తమిళిసై పాల్గొని ప్రసంగించారు. మహా నేత పీవీ నరసింహారావు శత జయంతి..గొప్ప పండుగ రోజు అని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. పీవీ భారతదేశ మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, పేద ప్రజల పెన్నిధి అని తెలిపారు.

పీవీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త అని గవర్నర్‌ ‌చెప్పారు. పీవీ కాంస్య విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం, పీవీ మార్గ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఆవిష్కరించిన పీవీ పుస్తకాలు భవిష్యత్‌ ‌తరాలకు ఉపయోగపడుతాయన్నారు. పీవీ రచనలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. పీవీ రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలాం చెప్పేవారని తమిళిసై గుర్తు చేశారు. ఆయన రాజకీయాలకు అతీతంగా పని చేసిన వ్యక్తి అని అన్నారు. అంతకుముందు స్వాగతోపన్యాసం చేస్తూ కలకాలం గుర్తుండే విధంగా రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే కేశవరావు స్పష్టం చేశారు.

పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో కేకే పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని గతేడాది సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ ఏడాది కాలం పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం. కొరోనా కారణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోయామని అన్నారు. తెలంగాణ గడ్డమిద పీవీ ఘనత చిరస్థాయిగా నిలిచిపోయింది. పీవీ రచనలను వెలుగులోకి తీసుకొచ్చాం. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నమస్తే పీవీ పుస్తకాన్ని తీసుకొచ్చామన్నారు. వెబినార్లు, అంతర్జాతీయ మిటింగ్‌లు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు మంచి స్పందన వొచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో పీవీ పోట్రెయిట్‌ను త్వరలోనే సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారని తెలిపారు. పీవీ సొంతూరు వంగరలో పీవీ పార్కులు, మ్యూజియంలు ఏర్పాటు చేసుకుంటున్నామని కేకే పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలోనూ పివి విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
పివి జ్ఞాపకార్థం

Leave a Reply