Take a fresh look at your lifestyle.

నా దారి రహదారి..!

  • నేను స్టేట్‌ ‌పార్వర్డ్..
  • ‌వివాదాస్పద వ్యక్తిని కాదు…ఫ్రెండ్లీ గవర్నర్‌ను
  • నా పర్యటనలు, పనులు ప్రజల కోసమే
  • రాజ్యాంగం ప్రకారం రాజ్‌భవన్‌ను, గవర్నర్‌ ‌చైర్‌ను గౌరవించాలి
  • ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌భేటి
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికి తెలుసని, మీడియాలో కూడా స్పష్టంగా చూపిస్తున్నారని, తాను చాలా ఫ్రెండ్లీ పర్సన్‌నని, సహాయం అందించేందుకు రాజ్‌భవన్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటానని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.బుధవారం దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజ్యాంగ బద్ధ స్థానంలో ఉన్నానని, ఎప్పుడూ చట్టాలకు లోబడే పని చేస్తానని, ఒకవేళ గవర్నర్‌ను అవమానం చేయాలని చూస్తే, దాని గురించి ఆందోళన చెందనని ఆమె తెలిపారు. గవర్నర్‌ అం‌టే తమిళి సై కాదని, రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న గవర్నర్‌ ఆఫీసుకు గౌరవం ఇవ్వాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను ఎలా ట్రీట్‌ ‌చేస్తున్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజలు, దేశానికే వదిలేస్తున్నానని అన్నారు. ఇలాంటి అంశాలపై తన అధికారాన్ని అమలు చేయనని…ఈ అంశాన్ని ప్రజలకే వదిలేస్తున్నానని గవర్నర్‌ ‌తెలిపారు.
తాను లేడీ, ప్రెండ్లీ, ట్రాన్స్‌పరెంట్‌ ‌గవర్నర్‌నని, పారదర్శకంగా తన విధులు నిర్వహిస్తానని, ఈ విషయం ప్రతీ  ఒక్కరికి తెలుసని ఆమె అన్నారు. తాను ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, అంశాల జోలికి వెళ్లలేదని, ఎప్పుడూ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని, కొరోనా సమయంలోనూ మంచి సలహాలను ప్రభుత్వానికి ఇచ్చినట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం తనపై ఇలానెందుకు వ్యవహరిస్తుందో తెలియదన్నారు. వ్యాక్సినేషన్‌ ‌తోనే ప్రస్తుతం మనమందరం క్షేమంగా  ఉన్నామని, మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కున్నామని, నాలుగో వేవ్‌ను సేఫ్‌గా ఎదుర్కునబోతున్నామని గవర్నర్‌ అన్నారు. దేశంలో చేపట్టిన గ్రాండ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌పై ఒక డాక్టర్‌గా ప్రధానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పానని తెలిపారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీలను ప్రారంభించినందుకు ప్రధానికి ధన్యావాదాలు తెలిపారు. ఈ డైరెక్ట్ ‌కనెక్టివిటీ రెండు ప్రాంతాల మధ్య బంధాన్ని, సాంస్కతిక బంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ సర్వీసులతో మెడికల్‌, ‌పిలిగ్రిమ్‌ ‌టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు.
తెలంగాణలో చేపట్టిన ట్రైబల్‌ ‌టూర్‌ ‌గురించి ప్రధానికి వివరించానని చెప్పారు. తెలంగాణలో 11 శాతం గిరిజన జనాభా ఉందన్నారు. ఇటీవల 500 కి.మీ పైగా ప్రయాణించి, 15 కి.మీ అడవిలో ప్రయాణించి చెంచులు నివసించే ప్రాంతాలను సందర్శించానని, ఆరు గ్రామాలను దత్తత తీసుకున్నానని ఆమె తెలిపారు. నాగర్‌ ‌కర్నూల్‌, ‌భదాధ్రి కొత్తగూడెంలోనూ పర్యటించానని, తన దృష్టి ఎప్పుడూ రాష్ట్ర ప్రజల సంక్షేమం పైనే ఉంటుందని గవర్నర్‌ అన్నారు. తాను చేసే పీపుల్స్ ‌ప్రెండ్లీ యాక్టివిటీని ప్రధానికి వివరించానన్నారు. తెలంగాణ, పుదుచ్ఛెరి రాష్ట్రాల అభివృద్ధికి  సంబంధించి పలు అభివృద్ధి నమూనాలను ప్రధానికి ఇచ్చానని చెప్పారు. ఒక మంచి అవగాహనా వాతావరణంలో పిఎంతో భేటి జరిగిందన్నారు. చాలా అంశాలపై ప్రధాని మోడీ  సలహాలు ఇచ్చారని, రాజ్‌ ‌భవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య దూరంపై కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో తన ప్రయాణాన్ని ఆపనని, ప్రధానితో ఈ విషయాలపై మాట్లాడలేదని ఆమె తెలిపారు. గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారనే ప్రశ్నను ప్రభుత్వాన్నే మీడియా అడగాలన్నారు. తాను ఏ అంశాన్నయినా రాజకీయం చేస్తే ఆ అంశాన్ని లేవనెత్తాలన్నారు. ఇది గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీ సీటని, ప్రధాని కోటా అని ఉండదని, ఈ సీటుకు సర్వీస్‌ ‌కేటగిరిలో ప్రొవిజన్‌ ఉం‌దన్నారు. గవర్నర్‌ ‌కోటలో  కౌశిక్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌పై తాను సంతృప్తి చెందలేదని, ఆయన అభ్యర్థిత్వంపై తాను సంతృప్తి  చెందలేదని, అదే చెప్పానని, చెప్పే హక్కు తనకుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థిని ఆమోదం తెలపాలని లేదన్నారు. గతంలో ఇద్దరు ఎమ్మెల్సీలను ఆమోదించినట్లు చెప్పారు.
వివాదస్పదం చేయడానికి ఈ అంశం సరికాదన్నారు. ఇది ఏమాత్రం రాజకీయ క్రమశిక్షణ కాదని, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం, రాజ్యాంగంలోని అంశాలనే తాను పరిగణనలోకి తీసుకున్నానని ఆమె అన్నారు. ఓపెన్‌ ‌హార్ట్‌తో విధానాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వం ఆమోదించవచ్చు… చర్చించవచ్చు…రాజ్‌ ‌భవన్‌లో సిఎం, మంత్రులు ఈ అంశాలపై తనతో చర్చించవచ్చునని, తాను ఎప్పుడూ వద్దనడం లేదని, వారికి అందుబాటులో ఉంటానని  గవర్నర్‌ ఈ ‌సందర్భంగా వెల్లడించారు. ఆ పని చేయకుండా వివాదాలకు తెరలేపటం ఏమిటనే అంశాన్ని ప్రజలకే వదిలేస్తున్నానన్నారు. ఒకవేళ ఏదైనా ఆమోదించకుంటే… గవర్నర్‌ ఆఫీసును అవమానించడం సరికాదన్నారు. ప్రోటోకాల్స్ ‌కల్పించకపోవడం, స్టేట్‌ ‌టూర్‌కి వెళ్తే అధికారులు రాకపోవడం తగదన్నారు. తన పర్యటన సందర్భంగా కలెక్టర్‌, ఎస్పీ రాకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిచారు. సీఎస్‌, అధికారులకు గవర్నర్‌ ‌టూర్‌ ‌ప్రొటోకాల్‌ ‌తెలుసునన్నారు. తనను అవమానించడంపై బాధలేదని, ఐతే  గవర్నర్‌ ఆఫీసు, అధికారాలపై ఆందోళన చెందుతున్నానని చెప్పారు. తన దగ్గర రాజ్యాంగబద్ధ అధికారాలు ఉన్నా.. వాటిని ఇలాంటి అంశాల్లో అమలు చేయనన్నారు. తాను ప్రజల వైపు, ప్రజల కోసం సానుకూలంగా ఉండటానికి వెళ్తానని, తాను స్టేట్‌ ‌పార్వర్డ్, ‌తన పర్యటనలు, పనులు ప్రజల కోసమేనని అన్నారు. మొదటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించాలన్నదే తన అభ్యర్థన అని, నేడు అదే తెలంగాణ ప్రభుత్వాన్ని తాను అడుగుతున్నానని గవర్నర్‌ అన్నారు.

Leave a Reply