బాలు కుటుంబానికి తీవ్ర సంతాపం ప్రకటన
విజయవాడ,సెప్టెంబర్ 25: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరి చందన్ సంతాపం వ్యక్తం చేశారు.
నేపథ్య గాయకుడిగా బాలు అభిమానుల ప్రశంసలు అందుకున్నారని కొని యాడారు. అత్యధిక పాటలు పాడి గిన్నిస్ రికార్డ్ సాధించడం అరుదైన ఘనతని అన్నారు. బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు గవర్నర్ హరిచందన్ చెప్పారు.