Take a fresh look at your lifestyle.

స్వీయ నియంత్రణ పాటించాలి: గవర్నర్‌

‌కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రజలతెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై పలు సూచనలు చేశారు. కరోనాపై బయోలాజికల్‌ ‌వార్‌ ‌చేయాలని, సెల్ఫ్ ‌ప్రొటెక్షన్‌- ‌బెస్ట్ ‌ప్రొటెక్షన్‌ అని గవర్నర్‌ ‌తమిళిసై తెలిపారు. జలుబు, దగ్గు, టెంపరేచర్‌ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇళ్లలోంచి వృద్ధులు, పిల్లలను బయటకు రానివ్వకండని, ప్రతి ఒక్కరు శానిటేషన్‌ ‌చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు అని గవర్నర్‌ ‌తమిళిసై తెలిపారు.

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని, జనతా కర్ఫ్యూను రాజ్‌భవన్‌ ‌కూడా పాటిస్తుందని గవర్నర్‌ ‌చెప్పారు.  ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా వైరస్‌  ‌ప్రబలకుండా అరికట్టగలమని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌తెలిపారు. పౌరులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆదివారం నాడు రాజ్‌భవన్‌లో కూడా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నాం. రాజ్‌భవన్‌లో థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశాం. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకింది. తెలంగాణలో ఎవరికీ కరోనా లేదు. కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనిగవర్నర్‌ ‌సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply