Take a fresh look at your lifestyle.

నేడు మేడారానికి గవర్నర్‌, ‌సిఎం ఏర్పాట్లను పర్యవేక్షించిన సిఎస్‌ , ‌డిజిపిలు

Governor, CM CS and DGPs medaram jathara Visit todayప్రజాతంత్ర, ములుగు:  అమ్మవార్లను దర్శించుకునేందుకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌, ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మేడారం రానున్నారు. గవర్నర్‌, ‌సీఎం కేసీఆర్‌ ‌పర్యటన నేపథ్యంలో మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌, ఉన్నతాధికారులతో బుధవారం సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి సక్ష నిర్వహించారు. జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, దర్శనాల వంటి అంశాలపై సక్షించారు.  జాతర ఏర్పాట్లపై సీఎస్‌, ‌డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లు బాగున్నాయని, పటిష్ట బందోబస్తు చేశామని అన్నారు. ఇకపోతే మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం సారలమ్మ రాకతో మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ ప్రధాన వడ్డె (పూజారి) కాక సారయ్య నేతృత్వంలోని వడ్‌వ్డడెలు అక్కడి సారలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గద్దెపైకి తోడ్కొని వస్తారు. అప్పటికే మేడారం చేరుకున్న పగిడిద్దరాజు సారలమ్మ రాక కోసం వేచి చూసే సంప్రదాయం కొనసాగుతున్నది. తమ ఇంటి ఇలవేల్పు సారలమ్మను మేడారం గ్దదెపై ప్రతిష్ఠించుకునే ముందు కన్నెపల్లి ఆడబిడ్డలు మేడారంలోని సారలమ్మ గ్దదెకు అలుకుపూత చేసి, ముగ్గులేసి సిద్ధం చేస్తారు. బుధవారం మధ్యాహ్నం మే డారానికి పది కిలోటర్ల దూరంలో ఉన్న కొండాయి నుంచి గోవిందరాజుల ప్రధాన వడ్డె దబ్బగట్ల గోవర్ధన్‌ ‌నేతృత్వంలోని వ్డడెలు గోవిందరాజులును గ్దదెకు తీసుకొస్తారు. మేడారానికి సారలమ్మ రాక, గోవిందరాజులు రాక దాదాపుగా ఒకే సమయం కావడం విశేషం. ఇదిలావుంటే మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలమని, ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సత్యవతి రాథోడ్‌ అననారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.

అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులు కావాలన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.  జాతర నిర్వహణ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ ‌నుంచి వరంగల్‌ ‌వరకు, మహబూబాబాద్‌ ‌నుంచి నర్సంపేట, వరంగల్‌ ‌నుంచి మేడారం వరకు వరంగల్‌ ‌నుంచి భూపాలపల్లి వరకు చేపట్టిన ఐదు రోడ్లను ప్రయాణఙకులకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులు సహనంతో వ్యవహరించాలన్నారు.  జాతరను దిగ్విజయంగా నడిపేందుకు డియా సహకారం అవసరమని వారు కోరారు. డియా సెంటర్‌లో ప్రతినిధులకు వార్తలు ఎప్పటికప్పుడు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

Leave a Reply