Take a fresh look at your lifestyle.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. వోటుహక్కు వినియోగించుకున్న తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై

కుటుంబ సభ్యులతో కలసి విరుంబాక్కంలో వోటు

‌ప్రతి ఒక్కరు వోటేయాలని తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ ‌పిలుపునిచ్చారు. మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌జరుగగా..చెన్నయ్‌లోని విరుగంబాక్కం పోలింగ్‌ ‌కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి వోటేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం వోటు మాత్రమేనని పేర్కొన్నారు. వోటు వేయడం నిబద్ధతకు నిదర్శనమని, అర్హులైన ప్రతి ఒక్కరు వోటేయాలని ఆమె సూచించారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద వోటర్లు కొరోనా నిబంధనలు పాటించాలని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply