Take a fresh look at your lifestyle.

పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో… జాతీయ పతాకావిష్కరణ

public Gardens, Governor,unveils flag, tamili sai

  • నేటి గణతంత్ర దినోత్సవానికి భారీభద్రత
  • జెండా ఆవిష్కరించనున్న గవర్నర్‌ ‌తమిళిసై

తెలంగాణ అవతరణ వేడుకల్లాగానే గణతంత్ర వేడుకలనునాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఆదివారం జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేసారు. గవర్నర్‌ ‌తమిళసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పలువురు ప్రముఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ‌స్వయంగా పర్యవేక్షించారు. రిపబ్లిక్‌డే పరేడ్‌ ‌జరిగే పబ్లిక్‌ ‌గార్డెన్స్‌ను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. శనివారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచిస్తారు. పబ్లిక్‌ ‌గార్డెన్స్‌తో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. పెట్రోలింగ్‌ ‌నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, ‌సిటీ సెక్యూరిటీ వింగ్‌, ‌సీఏఆర్‌ ‌విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొనున్నాయి. దాదాపు 1500 మంది సిబ్బందిని ఇక్కడ మోహరిస్తున్నారు. నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మప్టీ పోలీసులను మోహరించారు.పబ్లిక్‌ ‌గార్డెన్స్‌కు దారి తీసే రహదారుల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించడంతో పాటు ప్రధాన ద్వారాల వద్ద మెటల్‌ ‌డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు.

పరేడ్‌ను వీక్షించడానికి వచ్చే ప్రజలు తమ వెంట హ్యాండ్‌ ‌బ్యాగ్స్, ‌కెమెరాలు, టిఫిన్‌ ‌బాక్సులు, బ్రీఫ్‌ ‌కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. బందోబస్తు చర్యల్లో భాగంగా ఈసారి గగనతలంపై నుంచి కూడా నిఘా ఏర్పాటు చేశారు. రూఫ్‌ ‌టాప్‌ ‌వాచ్‌ ‌కోసం ఎత్తయిన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్య వేడుకల నేపథ్యంలో తాజ్‌ ఐలాండ్‌, ‌ఛాపెల్‌ ‌రోడ్‌ ’‌టీ’ జంక్షన్‌, ‌సైఫాబాద్‌ ‌పాత పోలీస్‌ ‌స్టేషన్‌, ‌బషీర్‌బాగ్‌ ‌జంక్షన్‌, ఇక్బాల్‌ ‌నార్‌, ఏఆర్‌ ‌పెట్రోల్‌ ‌పంప్‌, ఆదర్స్‌నగర్‌ ‌వద్ద ట్రాఫిక్‌ ‌మళ్లింపులు విధించారు. ఈ పాయింట్స్ ‌దాటి సాధారణ ట్రాఫిక్‌ను పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌వైపు అనుమతించరు. ఆదివారం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ‌తెలిపారు. భద్రతలోభాగంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైనప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, విధి నిర్వాహణలో ఉన్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సీపీ సూచించారు.

Tags: public Gardens, Governor,unveils flag, tamili sai

Leave a Reply