Take a fresh look at your lifestyle.

కిడ్నీ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి

‌సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ‌వైద్య కళాశాలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి కళాశాలను చాలా అభివృద్ధి చేశారని గవర్నర్‌ ‌ప్రశంసించారు. ఒక నెఫ్రాలజిస్ట్ ‌భార్యగా రోగుల బాధలు చూశాను అని తెలిపారు.

- Advertisement -

కిడ్నీ సమస్యపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్‌ ‌మన దరిచేరదని గవర్నర్‌ ‌స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ రోగుల కోసం 45 డయాలసిస్‌ ‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్లో 5 నుంచి 10 వరకు బెడ్లు ఉన్నాయి.

Leave a Reply