Take a fresh look at your lifestyle.

వ్యవసాయంలో టెక్నాలజీ జోడింపు

స్థిర వ్యవసాయంతో రైతులకు లాభం : వర్చువల్‌గా జాతీయ అగ్రికల్చరల్‌ ‌సైంటిఫిక్‌ ‌సదస్సును ప్రారంభించిన గవర్నర్‌ ‌తమిళిసై

‌స్థిర వ్యవసాయానికి నూతన టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. పర్యావరరణ హితం, స్ధిర వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలు భవిష్యత్‌లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేవిగా ఉన్నాయని గవర్నర్‌పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం రైతులకు సవాల్‌గా మారిందన్నారు. దీనిని అధిగమించడానికి వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించు కోవాలని చెప్పారు.

సోమవారం న్యూఢిల్లీకి చెందిన అగ్రికల్చరల్‌
‌సైంటిఫిక్‌ ‌తమిళ్‌సొసైటీ వారు నిర్వహించిన 6వ జాతీయ అగ్రికల్చరల్‌ ‌సైంటిఫిక్‌ ‌సదస్సును గవర్నర్‌ ‌తమిళిసై వర్చువల్‌ ‌విధానంలో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్క•తిలో వ్యవసాయం ఒక భాగమని, శతాబ్దాల తరబడి మన మన దేశ జీవనం విధానంగా కొనసాగుతోందన్నారు. కొత్త సంస్కరణలు, పథకాలు, వారికి సంబంధించిన కార్యక్రమాలు భవిష్యత్‌లో వారికి మరింత మంచి చేస్తాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న వివిధ రకాల మార్పులు, టెక్నాలజీలను గుర్తించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అకాడమిక్స్ ‌వ్యవసాయ విద్యంలో మరిన్నిమార్పులు తీసుకు రావాలన్నారు. తమిళంతో పాటు ఇతర భాషల్లో వ్యవసాయం గురించి ప్రమోట్‌ ‌చేస్తున్న అగ్రికల్చలర్‌ ‌సైంటిఫక్‌ ‌తమిళ్‌ ‌సొసైటీ చేస్తున్న కృషిని గవర్నర్‌ ‌ప్రశంసించారు.

Leave a Reply