ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ వరంగల్‌కు రానున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ఆమె కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు. గవర్నర్ శుక్రవారం ఉదయం 7.35 నిమిషాలకు పుదుచ్చేరి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆర్టస్ కళాశాల హెలిపాడ్‌కు చేరుకుని అక్కడి హరిత కాకతీయ హోటల్లో కొద్ది సేపు బస చేసిన అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం స్పెషల్ హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి, అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రాజ్‌భవన్ చేరుకుంటారు..