Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం ..!: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

గణతంత్ర దినోత్సవ ప్రసంగం లో గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళి సాయి సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..గణతంత్ర దినోత్సవం సందర్బంగా గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ తన ప్రసంగం లో…” ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడం మనందరికీ గర్వకారణం.

భారతదేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తి దాయకం. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన ఉద్యమ నాయకుడికే, ప్రజలు ఈ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతలు అప్పగించడం వల్ల తెలంగాణ దృష్టికోణంలో పాలన సాగుతున్నది. గడిచిన ఆరున్నరేళ్లలో పద్ధతి ప్రకారం జరిగిన కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది..” అన్నారు.

  • Governor Dr. Tamil Sai Soundarajan Republic Day wishes the Telangana peoples

Leave a Reply